వ‌ర్షాల కోసం గాడిద‌నెక్కిన వ‌రుడు!

ABN , First Publish Date - 2020-07-28T11:54:13+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక పెళ్లి ఊరేగింపు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈ ఊరేగింపులో వ‌రుడు గుర్రంపై కాకుండా గాడిదపై కూర్చున్నాడు. వరుడు నగర అధ్యక్షుడు, పటేల్. పట్టణ ప్రజలు పాల్గొన్న...

వ‌ర్షాల కోసం గాడిద‌నెక్కిన వ‌రుడు!

ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఒక పెళ్లి ఊరేగింపు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఈ ఊరేగింపులో వ‌రుడు గుర్రంపై కాకుండా గాడిదపై కూర్చున్నాడు. వరుడు నగర అధ్యక్షుడు, పటేల్. పట్టణ ప్రజలు పాల్గొన్న ఈ ఊరేగింపు వ‌ర్షాల కోసం జ‌రిగింది. న‌గ‌ర అధ్య‌క్షుడు వ‌రుని గెట‌ప్ వేసుకుని, గాడిదపై కూర్చుని, శ్మశానవాటిక వ‌ర‌కూ ఊరేగింపుగా వెళ్లి, అక్క‌డ ఉప్పుపోసి, మంచి వర్షాలు కుర‌వాల‌ని మొక్కుకున్నాడు. వ‌ర్షాకాలం వ‌చ్చిన‌ప్ప‌టికీ ఈ ప్రాంతంలో స‌రైన వర్షాలు కురియ‌డం లేదు. దీంతో రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రోవైపు న‌గ‌ర ప్ర‌జ‌లు వేడి వాతావ‌ర‌ణం నుంచి ఉప‌శ‌మ‌నం కోం ఎదురు చూస్తున్నారు. ఈ  నేప‌ధ్యంలో రౌ ప్రాంతానికి చెందిన నగర అధ్యక్షుడు శివ్‌డింగు గాడిద‌పై ఊరేగుతుండ‌గా,పెద్ద సంఖ్యలో ప్రజలు ఊరేగింపులో పాల్గొన్నారు. డోలు వాయిద్యాల మ‌ధ్య ఊరేగింపు కొన‌సాగింది. ఈ ప్రాంతంలో వ‌ర్షాల కోసం ఈ విధ‌మైన ఊరేగింపుల‌ను నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీ అని స్థానికులు తెలిపారు.

Updated Date - 2020-07-28T11:54:13+05:30 IST