ఎట్టకేలకు!

ABN , First Publish Date - 2021-01-16T05:28:47+05:30 IST

జూనియర్‌ ఇంటర్‌ తరగతులు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఎట్టకేలకు దీనిపై ఇంటర్‌ బోర్టు స్పష్టతనిచ్చింది. ఈ నెల 18 నుంచి మే 31 వరకూ పని దినాలును నిర్ధారిస్తూ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 106 రోజులు పాటు పనిదినాలుగా నిర్ణయించారు. రెండో శనివారాలు కూడా తరగతులు నిర్వహణకే మొగ్గు చూపింది. మొదటి సంవత్సరం కోర్సులో చేరే విద్యార్థులకు మొదటి దశ షెడ్యూల్‌ను ఈనెల 7 నుంచి 17 వరకూ కేటాయించింది. కళాశాలల్లో చేరే విద్యార్దులకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయాల్సిన బాధ్యత ఆయా యాజమన్యాలదేనని తేల్చి చెప్పింది. మొదటి దశలో ఎంపికైన విద్యార్థులు, వెయిటింగ్‌లో ఉన్న విద్యార్థుల వివరాలు ఆయా కళాశాలలను నోటిసు బోర్డులో ప్రదర్శించాలి. కేటగిరి వారిగా లేని పక్షంలోని మొదటి, రెండో విడతలలో ఖాళీలు చూపించిన తరువాత ఇతర కేటగిరిలకు భర్తీ చేయాలని నిబంధనలు పెట్టింది. కళాశాలల యాజమాన్యాలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్‌ఐవో మంజులా వీణ ఆదేశించారు.

ఎట్టకేలకు!

18 నుంచి జూనియర్‌ ఇంటర్‌ తరగతులు
మే 31 వరకూ...106 రోజుల పని దినాలు
క్యాలెండర్‌ విడుదల చేసిన ఇంటర్‌ బోర్డు
కలెక్టరేట్‌, జనవరి 15 
జూనియర్‌ ఇంటర్‌ తరగతులు సోమవారం నుంచి ప్రారంభం  కానున్నాయి. ఎట్టకేలకు దీనిపై ఇంటర్‌ బోర్టు స్పష్టతనిచ్చింది. ఈ నెల 18 నుంచి మే 31 వరకూ పని దినాలును నిర్ధారిస్తూ క్యాలెండర్‌ను విడుదల చేసింది. మొత్తం 106 రోజులు పాటు పనిదినాలుగా నిర్ణయించారు.  రెండో శనివారాలు కూడా తరగతులు నిర్వహణకే మొగ్గు చూపింది.  మొదటి సంవత్సరం కోర్సులో చేరే విద్యార్థులకు  మొదటి దశ షెడ్యూల్‌ను ఈనెల 7 నుంచి 17 వరకూ కేటాయించింది. కళాశాలల్లో చేరే విద్యార్దులకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయాల్సిన బాధ్యత ఆయా యాజమన్యాలదేనని తేల్చి చెప్పింది. మొదటి దశలో ఎంపికైన విద్యార్థులు,  వెయిటింగ్‌లో  ఉన్న విద్యార్థుల వివరాలు ఆయా కళాశాలలను నోటిసు బోర్డులో ప్రదర్శించాలి. కేటగిరి వారిగా లేని పక్షంలోని మొదటి, రెండో విడతలలో ఖాళీలు చూపించిన తరువాత ఇతర కేటగిరిలకు భర్తీ చేయాలని నిబంధనలు పెట్టింది. కళాశాలల యాజమాన్యాలు కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆర్‌ఐవో మంజులా వీణ ఆదేశించారు.

Updated Date - 2021-01-16T05:28:47+05:30 IST