‘సాయ్‌’ ట్రయల్స్‌కు శ్రీనివాస నో !

ABN , First Publish Date - 2020-02-18T10:49:40+05:30 IST

ట్రయల్స్‌కు రావాలంటూ భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) పంపిన ఆహ్వానాన్ని ‘కంబళ చిరుత’ శ్రీనివాస గౌడ తిరస్కరించాడు. కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌

‘సాయ్‌’ ట్రయల్స్‌కు శ్రీనివాస నో !

న్యూఢిల్లీ: ట్రయల్స్‌కు రావాలంటూ భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్‌) పంపిన ఆహ్వానాన్ని ‘కంబళ చిరుత’ శ్రీనివాస గౌడ తిరస్కరించాడు. కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు ఆదేశాల మేరకు బెంగళూరులోని తమ కేంద్రంలో ట్రయల్‌కు హాజరు కావాలని శ్రీనివాసను ‘సాయ్‌’ కోరింది. కానీ తానింకా కంబళ పోటీల్లో పాల్గొనాల్సివుందని, కాబట్టి తనకు ఓ నెల సమయం కావాలని అతను కోరాడు. కొన్నేళ్లుగా శ్రీనివాస సుమారు 100 కంబళ పోటీల్లో పాల్గొని అనేక టైటిల్స్‌ గెలిచాడు. ‘ముఖ్యమంత్రిని కలిసేందుకు అతడు సోమవారంనాడు బెంగళూరు వచ్చాడు. శ్రీనివాసను సాయ్‌ కేంద్రానికి తీసుకు వెళ్లేందుకు అధికారులు సీఎం నివాసానికి వెళ్లారు. కానీ వారితో వెళ్లేందుకు గౌడ ఆసక్తి చూపలేదు’ అని సాయ్‌ వర్గాలు వెల్లడించాయి. కాగా కంబళపోటీల్లో సంచలనం సృష్టించిన శ్రీనివాస గౌడకు ముఖ్యమంత్రి రూ. 3 లక్షలు అందించారు. మూడబిద్రికి చెందిన 28 ఏళ్ల శ్రీనివాస భవన నిర్మాణ కార్మికుడు. ఈ నెలారంభంలో జరిగిన కంబళ పోటీలో అతడు తన దున్నలతో 142.50 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్ల రికార్డు టైమింగ్‌తో పూర్తి చేసి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ వేగాన్ని 100 మీ.లకు లెక్కగడితే  9.55 సెకన్లుగా తేలింది. 


Updated Date - 2020-02-18T10:49:40+05:30 IST