కరోనా కట్టడికి రంగంలోకి దిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ!

ABN , First Publish Date - 2020-04-05T01:41:45+05:30 IST

కరోనా కట్టడి కోసం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలోకి దిగింది. కరోనా కట్టడిలో ఉపయోగపడే రకరకాల వస్తువుల అభివృద్ధి కోసం నాలుగు కీలక సంస్థలకు 1.25 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది.

కరోనా కట్టడికి రంగంలోకి దిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ!

న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. కరోనా కట్టడిలో ఉపయోగపడే రకరకాల ఉత్పత్తుల అభివృద్ధి కోసం నాలుగు కీలక పరిశోధన సంస్థలకు 1.25 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది. దేశంలోని మూడు ప్రఖ్యాత ఐఐటీలతో పాటూ జవహర్ లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సంస్థ(జేఎన్‌సీఏఎస్ఆర్) కరోనా నిరోధక ఉత్తులను అభివృద్ధి చేయనున్నాయి. కొత్త డిస్‌ఇన్ఫెక్టెంట్‌ల రూపకల్పనలో ఐఐటీ ఢీల్లీ తలమునకలై ఉండగా..జేఎన్‌సీఏఎస్ఆర్.. వైరస్ నిరోధక కోటింగ్‌లను అభివృద్ధి చేయనుంది. ఇక ఐఐటీ బాంబే వివిధ రకాల బయోమార్కర్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త వైద్య చికిత్సలు, రోగం ఆట కట్టించే యాంటీ బాడీల రూపకల్పనకూ ఈ మార్కర్లు ఉపయోగపడనున్నాయి. 


Updated Date - 2020-04-05T01:41:45+05:30 IST