Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఉక్రెయిన్‌లోనే ఇంకా 40 మంది భారతీయులు.. వారిలో కొందరు మాత్రమే..!

twitter-iconwatsapp-iconfb-icon
ఉక్రెయిన్‌లోనే ఇంకా 40 మంది భారతీయులు.. వారిలో కొందరు మాత్రమే..!

న్యూఢిల్లీ: రష్యా సైనిక చర్యతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. దాదాపు నెల రోజుల నుంచి రష్యా వరుస దాడులతో ఉక్రెయిన్‌ను ఊపిరాడకుండా చేస్తోంది. దీంతో ఇప్పటికే లక్షలాది మంది ఆ దేశాన్ని వదిలి ఇతర దేశాలకు తరలిపోయారు. ఇక ఆ దేశంలో ఉన్న విదేశీయులు సైతం వారి వారి దేశాలకు వెళ్లిపోయిన వైనం. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా అక్కడ ఉన్న మన పౌరులను స్వదేశానికి తరలించింది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు సుమారు 22,500 మందిని స్వదేశానికి తీసుకొచ్చింది మోదీ సర్కార్. తాజాగా రాజ్య సభలో ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపుపై వచ్చిన ప్రశ్నకు భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. 


దీనిలో భాగంగా ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 22,500 మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు తెలిపారు. ఇంకా 40 నుంచి 50 మంది వరకు అక్కడే ఉన్నట్లు పేర్కొన్నారు. వీరిలో కొందరు స్వదేశానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని, వారిని భారత్‌కు తరలించేందుకు ఎంబసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లండించారు. అయితే, మరికొందరు మాత్రం స్వదేశానికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపారు. అలాగే వివిధ కారణాలతో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించేందుకు గడిచిన ఐదేళ్లలో ఎన్ని ఆపరేషన్స్ నిర్వహించడం జరిగిందని మరో ప్రశ్న వచ్చింది. దీనికి మంత్రి ఇలా సమాధానం చెప్పారు. మహమ్మారి కరోనా సమయంలో భారత ప్రభుత్వం చేపట్టిన వందే భారత్ మిషన్‌, ఎయిర్ బబుల్ ఒప్పందాలను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. 


వీటి ద్వారా సుమారు 2.97 కోట్ల మందిని తరలించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 'ఆపరేషన్ దేవి శక్తి' ద్వారా ఆఫ్గనిస్థాన్ నుంచి 669 మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్లు చెప్పారు. వీరిలో 448 మంది భారతీయులు ఉంటే.. 206 మంది ఆఫ్గాన్స్, 15 మంది ఇతర దేశాలకు(నేపాల్, లెబనాన్, ఉగాండా) చెందిన వారు ఉన్నట్లు వివరించారు. దీనికోసం ఆగస్టు 16 నుంచి 25 మధ్య ఏడు విమాన సర్వీసులు నడిపినట్లు మంత్రి తెలిపారు.     

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

తాజా వార్తలుLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.