ప్రతిపక్షాలు జీర్ణించుకోలేవు : పీయూష్ గోయల్

ABN , First Publish Date - 2022-02-13T20:48:39+05:30 IST

సోషల్ మీడియా షార్క్ ట్యాంక్ ఫీవర్ కేంద్ర మంత్రి పీయూష్

ప్రతిపక్షాలు జీర్ణించుకోలేవు : పీయూష్ గోయల్

న్యూఢిల్లీ : సోషల్ మీడియా షార్క్ ట్యాంక్ ఫీవర్ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌కు కూడా వచ్చింది. ఫేమస్ బిజినెస్ రియాలిటీ టెలివిజన్ సిరీస్‌లో అనుపమ్ మిట్టల్ మీమ్‌తో ప్రతిపక్షాలపై దాడి చేశారు. ‘ఈ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను’ అనే మీమ్‌ను దేశంలో స్టార్టప్ కంపెనీల అభివృద్ధి గురించి వివరించడానికి, ఈ విషయాన్ని ప్రతిపక్షాలు సహించలేవని చెప్పడానికి వాడుకున్నారు. 


2022లో కేవలం 40 రోజుల్లో 8 కొత్త యూనికార్న్స్ వచ్చాయని, అంటే 2022లో ప్రతి ఐదు రోజులకు ఒక కొత్త యూనికార్న్ పుడుతోందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని తెలుసుకుంటే ప్రతిపక్షాలు జీర్ణించుకోలేవని పేర్కొన్నారు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 


‘‘ప్రశ్న : 2022లో ప్రతి ఐదు రోజులకు ఒకసారి భారత దేశం ఏం చేసింది?

జవాబు : యూనికార్న్‌ను ఏర్పాటు చేసింది!’’ అని ట్వీట్ చేశారు. 


ఈ పోస్ట్‌ను అనుపమ్ మిట్టల్ కూడా షేర్ చేశారు. భారత దేశం చాలా మోడీవేట్ అయిందని పేర్కొన్నారు. ఆయన షాదీ డాట్ కామ్ వ్యవస్థాపకుడు. ఆయన ఈ రియాలిటీ షోలో ఓ షార్క్ రూపంలో వచ్చి వ్యాపారవేత్తల బిజినెస్ ఐడియాలను వింటూ ఉంటారు. ఆయా కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడంపై నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. 


1 బిలియన్ డాలర్లకుపైగా విలువైన స్టార్టప్ కంపెనీని యూనికార్న్ అంటారు. 2022లో 40 రోజుల్లో వచ్చిన యూనికార్న్‌లలో XpressBees, LivSpace, ElasricRun, Polygon, DarwinBox, LEAD School, Fractal ఉన్నాయి. 


స్టార్టప్ ఇండియా కాంపెయిన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం 2016లో ప్రారంభించింది. పన్ను ప్రోత్సాహకాలు ఇస్తూ పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది. 2021 కేంద్ర బడ్జెట్‌లో పన్ను ప్రయోజనాలను అందజేసింది. 




Updated Date - 2022-02-13T20:48:39+05:30 IST