రేషన్‌ సబ్సిడీల్లో కేంద్రానికి క్రెడిట్‌ ఇవ్వరా?

ABN , First Publish Date - 2020-08-08T07:14:08+05:30 IST

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీ కింద కేంద్రం అందజేస్తున్న సరుకుల విషయంలో స్వయంగా తమకు తా ము అందజేస్తున్నట్లుగా కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయని కేంద్ర ఆహారశాఖ మంత్రి రాం విలాస్‌ పాసవాన్‌...

రేషన్‌ సబ్సిడీల్లో కేంద్రానికి క్రెడిట్‌ ఇవ్వరా?

  • తెలంగాణ సహా 11 రాష్ట్రాలపై పాసవాన్‌ అసహనం


న్యూఢిల్లీ, ఆగస్టు 7: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు సబ్సిడీ కింద కేంద్రం అందజేస్తున్న సరుకుల విషయంలో స్వయంగా తమకు తా ము అందజేస్తున్నట్లుగా కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్నాయని కేంద్ర ఆహారశాఖ మంత్రి రాం విలాస్‌ పాసవాన్‌ విమర్శించారు. లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు చేరే విషయంలో కేంద్రానికి ఏ మాత్రం క్రెడిట్‌ ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఈ ధోరణి తెలంగాణ సహా 11 రాష్ట్రాల్లో కొనసాగుతోందని, వీటిలో చాలామటుకు బీజేపీయేతర ప్రభుత్వ పాలన ఉన్న రాష్ట్రాలే ఉన్నాయని చెప్పారు.


రేషన్‌ షాపుల ద్వారా ఇచ్చే సరుకుల్లో భాగంగా కిలోకు రూ.2 ధర చొప్పున బియ్యం, రూ.3 ధర చొప్పున గోఽధుమలను కేంద్రం అం దజేస్తోంది. ఇందుకు రాష్ట్రాలు భరించేది రూ.10వేల కోట్లేనని.. ఆ రకంగా కేంద్ర సర్కారు 90శాతం సబ్సిడీని భరిస్తోందని పాసవాన్‌ వివరించారు. అయితే  కొన్ని రాష్ట్రాలు మాత్రం ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రకటనల్లో కేంద్రం సబ్సిడీలను ప్రస్తావించకుండా క్రెడిట్‌ అంతా తమ ఖాతాలోనే వెసుకుంటున్నాయని శుక్రవారం వర్చువల్‌ మీడియా భేటీలో పాసవాన్‌ విమర్శించారు. మంత్రి పేర్కొన్న ఆ 11 రాష్ట్రాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఛతీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిసా, పశ్చిమబెంగాల్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, త్రిపుర. వీటిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిసా రాష్ట్రాలు కిలో ధర రూ.1 చొప్పున బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాయి. బెంగాల్‌, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా ఇస్తుండగా త్రిపురలో కిలో ధర రూ.3 చొప్పున పంపిణీ చేస్తున్నారు.


Updated Date - 2020-08-08T07:14:08+05:30 IST