సీఎం ఉద్ధవ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు..మంత్రి రాణేపై మరో కేసు

ABN , First Publish Date - 2021-08-24T15:37:38+05:30 IST

కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై పూణే పోలీసులు మరో కేసు నమోదు చేశారు....

సీఎం ఉద్ధవ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు..మంత్రి రాణేపై మరో కేసు

పూణే(మహారాష్ట్ర): కేంద్రమంత్రి నారాయణ్ రాణేపై పూణే పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై నారాయణ్ రాణే అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీంతో యువసేన ఫిర్యాదు మేర రాణేపై పూణే నగరంలోని చతుర్ శృంగి పోలీసులు ఐపీసీ సెక్షన్ 153, 505 కింద మరో కేసు నమోదు చేశారు. ఉద్ధవ్ ఠాక్రే చేసిన ప్రసంగంలో స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరాన్ని మర్చిపోయారని  రాణే ఆరోపించారు. ‘‘స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం గురించి సీఎంకు తెలియకపోవడం సిగ్గుచేటు, సంవత్సరం గురించి ఆరా తీసేందుకు సీఎం వెనుతిరిగారు,  నేను అక్కడ ఉంటే గట్టి సమాధానం చెప్పేవాడిని’’ అని రాణే వ్యాఖ్యానించారు.మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాణేపై నాసిక్ పోలీసులు కూడా కేసు నమోదు చేసి, అరెస్ట్ వారెంట్ జారీ చేసినట్లు సమాచారం.మొత్తం మీద కరోనా నిబంధనల ఉల్లంఘనతో పాటు సీఎంపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో రాణేపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2021-08-24T15:37:38+05:30 IST