మోదీని ‘సంకట మోచనుడి’గా అభివర్ణించిన కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2021-04-07T19:02:45+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోవిడ్-19 మహమ్మారి సమయంలో

మోదీని ‘సంకట మోచనుడి’గా అభివర్ణించిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోవిడ్-19 మహమ్మారి సమయంలో ‘సంకట మోచనుడి’ పాత్ర పోషిస్తున్నారని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు. ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ను ఆయన నేతృత్వంలో భారత దేశం నిర్వహిస్తోందన్నారు. శాస్త్రవేత్తల కఠోర శ్రమకు ఫలితంగా వ్యాక్సినేషన్ జరుగుతోందన్నారు. 


బుధవారం నఖ్వీ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, కోవిడ్-19 నుంచి కాపాడుకోవడానికి ముందు జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందన్నది నిజమేనని, అయితే ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పారు. నూటికి నూరు శాతం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను నూటికి నూరు శాతం పాటించాలని చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోవిడ్-19 మహమ్మారి సమయంలో ‘సంకట మోచనుడి’ పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. శాస్త్రవేత్తల కఠోర శ్రమ ఫలితంగా వ్యాక్సినేషన్ జరుగుతోందని తెలిపారు. ప్రపంచంలో అతి పెద్ద వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్‌ మన దేశంలో జరుగుతోందన్నారు. 


Updated Date - 2021-04-07T19:02:45+05:30 IST