హైదరాబాద్ సిటీ/మంగళ్‌హాట్ : కేంద్ర సహాయ మంత్రిగా కిషన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే రెడ్‌హిల్స్ డివిజన్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఎంఎన్‌జే కేన్సర్ ఆస్పత్రి వద్దకి రాగానే మురుగు నీటి ప్రవాహాన్ని చూసి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డీజీఎం, మేనేజర్‌లను స్వయంగా ఆదేశించారు. ఆ సమయంలో హడావిడి చేసిన సదరు అధికారులు మంత్రి వెళ్లిపోగానే పట్టించుకోవడం వదిలేశారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.