రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-07-09T00:40:05+05:30 IST

రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని కేంద్ర

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో నష్టపోతున్న రైతులు: కేంద్ర మంత్రి

నల్గొండ: రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్‌ బీమా యోజనను రాష్ట్రం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్‌చౌదరి దుయ్యబట్టారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ఉచిత హామీలు ఇచ్చి రైతులను మోసం చేస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించిందని తప్పుబట్టారు. ప్రధాని నరేంద్రమోదీ రైతులకు తక్కువ ధరకే ఎరువులను అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక బడ్జెట్‌ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. అదేవిధంగా కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద రైతులకు రూ.6 వేలు పెట్టుబడి సాయంగా ఇస్తున్నట్లు  కైలాష్‌ చౌదరి పేర్కొన్నారు. 

Updated Date - 2022-07-09T00:40:05+05:30 IST