మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ

ABN , First Publish Date - 2022-01-08T17:30:15+05:30 IST

మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు

మిషనరీస్ ఆఫ్ చారిటీ ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్ పునరుద్ధరణ

కోల్‌కతా : మదర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థకు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) రిజిస్ట్రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం జనవరి 6న పునరుద్ధరించింది. ఈ అనుమతులు 2026 డిసెంబరు 31 వరకు చెల్లుబాటు అవుతాయి. ఇటీవల ఈ అనుమతులను పునరుద్ధరించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తిరస్కరించిన సంగతి తెలిసిందే. 


ఎఫ్‌సీఆర్ఏ రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించడంతో మిషనరీస్ ఆఫ్ చారిటీ సంస్థలు విదేశీ విరాళాలను స్వీకరించి, ఆ నిధులను ఉపయోగించుకోవచ్చు. 2022 జనవరి 7 వరకు మన దేశంలో 16,908 క్రియాశీలక, ఉనికిలో ఉన్న ఎష్‌సీఆర్ఏ సంస్థలు ఉన్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. 


Updated Date - 2022-01-08T17:30:15+05:30 IST