వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా రావడంపై కేంద్రం వివరణ

ABN , First Publish Date - 2020-12-05T22:39:44+05:30 IST

కోవ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులకే హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్‌‌కు కరోనా పాజిటివ్ రావడంపై కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ...

వ్యాక్సిన్ తీసుకున్న మంత్రికి కరోనా రావడంపై కేంద్రం వివరణ

అనిల్ విజ్ ఫస్ట్ డోస్ మాత్రమే తీసుకున్నారు: కేంద్ర ఆరోగ్య శాఖ

న్యూఢిల్లీ: కోవ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులకే హర్యానా ఆరోగ్య మంత్రి అనిల్ విజ్‌‌కు కరోనా పాజిటివ్ రావడంపై కేంద్ర ఆరోగ్య శాఖ వివరణ ఇచ్చింది. కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్‌లో భాగంగా మంత్రి అనిల్ విజ్‌ ఫస్ట్ డోస్ మాత్రమే తీసుకున్నారని.. కోవ్యాక్సిన్‌ను మొత్తం రెండు డోస్‌ల్లో ఇవ్వడం జరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. భారత్ బయోటెక్ కోవాక్సిన్ మూడో ట్రయల్ మూడో రౌండ్‌లో దాదాపు 26,000 మందిపై పరీక్షలు జరిపారు. అందులో అనిల్ విజ్ ఒకరు. కోవ్యాక్సిన్ మూడో దశ ట్రయల్ హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగింది. అందులో మొదటి టీకాను అనిల్ విజ్‌పై ప్రయోగించారు. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌లో కూడా మూడో దశ భారత్ బయోటెక్ కోవ్యాక్సిన్ పరీక్షలు జరిగాయి. దాదాపుగా 100 నుంచి 200 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు. ఫిబ్రవరి చివరి నాటికి తుది అనుమతులు పొంది వ్యాక్సిన్ మార్కెట్లోకి వచ్చే ఆస్కారం ఉందని డాక్టర్లు చెబుతున్నారు.



Updated Date - 2020-12-05T22:39:44+05:30 IST