Abn logo
Jun 19 2021 @ 23:06PM

కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించాలి

బుట్టాయగూడెం, జూన్‌ 19: కరోనా వ్యాప్తిని జాతీయ విపత్తుగా ప్రకటిం చాలని ఇఫ్టూ ఆధ్వర్యంలో శనివారం దొరమామిడిలో సంతకాల సేకరణ చేపట్టారు. కరోనా నియంత్రణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని సీపీఐ ఎం ఎల్‌ న్యూడెమోక్రసీ నాయకుడు ధర్ముల సురేష్‌ అన్నారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలను పెంచారని విమర్శించారు. ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. వడ్లమూడి వెంకటేశ్వరావు, పాకీరం రాజేష్‌, ధర్ముల లక్ష్మి, కేవీ.రమణ పాల్గొన్నారు.