23% పెరిగిన యూనియన్‌ బ్యాంక్‌ లాభం

ABN , First Publish Date - 2022-05-14T08:29:04+05:30 IST

23% పెరిగిన యూనియన్‌ బ్యాంక్‌ లాభం

23% పెరిగిన యూనియన్‌ బ్యాంక్‌ లాభం

న్యూఢిల్లీ: యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మార్చితో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన రూ.1,557.09 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 22.68 శాతం వృద్ధి చెందింది. స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన 8.26 శాతం వృద్ధితో రూ.1,440 కోట్ల లాభం నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌  25.29 శాతం పెరిగి రూ.6,769 కోట్లకు చేరింది.  

Read more