చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత

ABN , First Publish Date - 2021-10-28T05:33:25+05:30 IST

జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు బ్యాంక్‌లు చేయూత ఇస్తున్నట్లు లీడ్‌బ్యాంక్‌ కన్వీనర్‌, యూనియన బ్యాంక్‌ డీజీఎం రవికుమార్‌ తెలిపారు.

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు చేయూత
చెక్కులు పంపిణీ చేస్తున్న డీజీఎం రవికుమార్‌ తదితరులు

యూనియన బ్యాంక్‌ డీజీఎం రవికుమార్‌

గుంటూరు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు బ్యాంక్‌లు చేయూత ఇస్తున్నట్లు లీడ్‌బ్యాంక్‌ కన్వీనర్‌, యూనియన బ్యాంక్‌ డీజీఎం రవికుమార్‌ తెలిపారు. గుంటూరులోని ఇండియన టుబాకో అసోసియేషన హాల్‌లో బుధవారం ముద్ర, స్టాండప్‌, పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ తదితర పథకాలకు సంబంధించి చిన్న, మధ్య తరహా వ్యాపారులకు రూ.56 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమలు, వ్యాపార సంస్థల వల్ల ఉపాధి సౌకర్యాలు మెరుగు పడతాయన్నారు.     రుణాలు పొందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు సకాలంలో తిరిగి చెల్లిస్తే ఎక్కువ మందికి రుణాలిచ్చే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఏజీఎంలు గణేష్‌, తిలక్‌, ఎల్‌డీఎం ఈదర రాంబాబు, బ్యాంకు మేనేజర్లు ప్రసంగించారు.  


Updated Date - 2021-10-28T05:33:25+05:30 IST