Abn logo
Sep 25 2021 @ 00:26AM

అప్పన్న సన్నిధిలో కేంద్ర సహాయ మంత్రి

ఆలయంలో కేంద్ర మంత్రి సంతన్‌ ఠాకూర్‌

సింహాచలం, సెప్టెంబరు 24: కేంద్ర షిప్పింగ్‌, పోర్ట్సు,  శాఖా మంత్రి  సంతన్‌ ఠాకూర్‌ శుక్రవారం ఉదయం సింహాచలేశుడిని దర్శించుకున్నారు. ఏఈవో ఎన్‌.ఆనందకుమార్‌ మంత్రికి స్వాగతం పలికారు. కప్పస్తంభ ఆలింగనం అనంతరం మంత్రి గోత్రనామాలతో అర్చకులు పూజలు చేసి, శేషవస్త్రాన్ని పర్యవేట్టంగా చుట్టారు. గోదాదేవి దర్శనం అనంతరం వేదాశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు. కాగా కేంద్ర మంత్రి దేవస్థానానికి వచ్చినా ఆలయ ఈవో ఎంవీ సూర్యకళ ఎక్కడా కనిపించలేదు. అంతేకాకుండా మంత్రి కారును ప్రధాన రాజగోపురానికి 200 మీటర్ల దూరంలో నిలిపివేయడంపై వీహెచ్‌పీ నేత పూడిపెద్ది శర్మ, బీజేపీ నేత  పేరి శ్రావణ్‌కుమార్‌ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.