Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆ ట్యాబెట్ల తయారీకి అనుమతి... 15 శాతం పెరిగిన యూనికెమ్ లాబ్స్ షేర్లు...

హైదరాబాద్ : అరిపిప్రజోల్ టాబ్లెట్‌ల తయారీకిగాను...  యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యుఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి యునికెమ్ లాబొరేటరీస్ ఆమోదం పొందింది. ఈ క్రమంలో... నేడు(శుక్రవారం)...  కంపెనీ షేర్లు భారీ వృద్ధిని నమోదు చేసుకున్నాయి. యునికెమ్ లాబొరేటరీస్ షేర్లు శుక్రవారం ఇంట్రా-డేలో 15 శాతం పెరిగి రూ. 257 కు  చేరుకున్నాయి. ఆటిస్టిక్ డిజార్డర్‌తో సంబంధమున్న స్కిజోఫ్రెనియా,  ఇరిటేషన్ కోసం అరిపిప్రజోల్ మాత్రలను వైద్యులు సిఫారసు చేస్తారన్న విషయం తెలిసిందే. ఈ మాత్రల ఉత్పత్తిని యునికెమ్ తన ఘజియాబాద్ ప్లాంట్ నుంచి చేయనుంది.


ఈ క్రమంలో... కంపెనీ షేర్లు ఉదయం సెషన్‌లోనే 14 శాతం పెరిగి రూ. 255.50 వద్ద ట్రేడవుతున్నాయి. ఎస్అండ్‌పీ బీఎస్ఈ సెన్సెక్స్‌లో 0.09 శాతం లాభపడింది. మొత్తంగా 784 వేల షేర్లు కౌంటర్‌లో చేతులు మారాయి. దీంతో ఈ స్టాక్... ఈ ఏడాది నవంబరు 22 నాటి 52 వారాల కనిష్ట స్థాయి రూ. 197.50 నుంచి 30 శాతం కోలుకుని, ఈ ఏడాదే మే 21 న 52 వారాల గరిష్ఠ స్థాయి రూ. 374.90 ని తాకింది.  ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో యునికెమ్ ల్యాబ్స్ మార్జిన్‌లపై ఒత్తిడి కారణంగా ప్రతికూల కారకాలకు సంబంధించిన ఔట్‌లుక్‌ను సవరించడం, దాని కీలక ఎగుమతి మార్కెట్(యుఎస్)లో ధరల ఒత్తిడి కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో లాభదాయకత స్థాయిలు గణనీయంగా తగ్గడం ద్వారా ఏకీకృత ప్రాతిపదికన కంపెనీ నికర నష్టాలను ఆర్జించింది. తాజా పరిణామాల నేపధ్యంలో... మళ్ళీ షేర్లు పుంజుకున్నాయి. 

Advertisement
Advertisement