Advertisement
Advertisement
Abn logo
Advertisement

వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం..

తిరుపతి(కల్చరల్‌), నవంబరు 29: ‘‘కదం త్రొక్కుతూ, పదం పాడుతూ, హ్రుదాంతరాళం ఘర్జిస్తూ పదండి పోదాం..’’ అంటూ మహాకవి శ్రీశ్రీ ఇచ్చిన పిలుపు కార్మిక, కర్షకలోకంలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంది. శ్రామికజీవుల పక్షాన నిలిచి పాలక పక్షాలను నిలదీసే ప్రళయ ఘర్జన వంటి కవిత్వంతో నిండిన ‘మహాప్రస్థానం’ పుస్తకం వెలువడి 70 ఏళ్లు నిండిన సందర్భంగా ఒక వినూత్న కార్యక్రమాన్ని తిరుపతిలోని మానవ వికాస వేదిక చేపట్టింది. ఈ తరానికి శ్రీశ్రీ కవిత్వాన్ని చేరువ చేసేందుకు ‘మహాప్రస్థానం’ పుస్తకాన్ని జేబులో ఇమిడిపోయే సైజులో ముద్రించింది. మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుపతిలోని ఉదయీ ఇంటర్నేషనల్‌లో ఈ పుస్తకం ఆవిష్కరణ ఉంటుంది. ఇందుకు ముందుగా సోమవారం నగరంలో  కృష్ణాపురం ఠాణా నుంచి గాంధీరోడ్డు మీదుగా అంబేడ్కర్‌ విగ్రహం దాకా ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం ఉదయం బస్టాండు వద్ద నుంచి శ్రీశ్రీ చిత్రపటం, మహాప్రస్థానం పుస్తకాలను పల్లకిలో ఊరేగిస్తారు. ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రసిద్ధ విమర్శకుడు వెల్చేరు నారాయణరావు, కవి కె.శివారెడ్డి పాల్గొంటారు. 

Advertisement
Advertisement