Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 11 Aug 2022 03:00:25 IST

పాపం ఎస్పీలు

twitter-iconwatsapp-iconfb-icon

వైసీపీ నేతల కేసుల్లో వారికి సినిమా కష్టాలు

వెనకేసుకురాలేక అవస్థలు.. విచిత్ర కథనాలు

ఆ న్యూడ్‌ వీడియో ఒరిజినల్‌ కాదు

మాధవ్‌ వ్యవహారంలో సెలవిచ్చిన అనంత ఎస్పీ 

కోర్టులోకి దొంగలను కుక్కలు తరిమాయి

మంత్రి కాకాణి కేసులో నెల్లూరు ఎస్పీ ప్రకటన

అతిగా తాగొద్దంటే డ్రైవర్‌ తిరగబడ్డాడు 

ఎమ్మెల్సీ అనంత కేసులో తేల్చిన కాకినాడ ఎస్పీ


ఏ ఖాకీకీ రావొద్దీ కష్టం!

కనిపించే మూడుసింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని నాలుగో సింహమేరా..పోలీస్‌ అనేది ఓ సినిమాలో డైలాగ్‌. ఏపీలో మాత్రం అధికారపార్టీకి చెందిన ముగ్గురు నేతల వ్యవహారంలో నాలుగోసింహం పడుతున్న కష్టం అంతాఇంతా కాదనే కామెంట్‌ పోలీసు వర్గాలనుంచే వినిపిస్తోంది. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు, ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారాలను ఈ వర్గాలు ఉదహరిస్తున్నాయి.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏదైనా నేరం జరిగితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తులో వెల్లడయ్యే విషయాలను పోలీసులు బయటికి చెబుతారు. తమకు లభించిన ఆధారాలతో సహా కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేస్తారు. దేశంలో ఎక్కడైనా పోలీసులు ఇదే పని చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏనేరం జరిగినా అందులో నిజానిజాలను కానీ, దర్యాప్తులో లభించిన ఆధారాలను కానీ బయట పెట్టలేని దుస్థితి పోలీసులది. అధికార పార్టీ నేతలకు సంబంధించిన కేసుల్లో ఒక విధంగా.. ప్రతిపక్షాలపై మరోలా.. సామాన్యులకైతే ఇంకో తరహాలో మాట్లాడాల్సి వస్తోంది. తాము చదువుకున్న ఐపీసీకి, శిక్షణలో నేర్చుకున్న నేర దర్యాప్తునకు, విధినిర్వహణలో పాటించాల్సిన పోలీస్‌ మాన్యువల్‌కు సంబంధం లేకుండా మాట్లాడాల్సిన పరిస్థితి ఐపీఎస్‌ అధికారులకు సైతం రావడం పొరుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమైంది.  ఈ ఏడాది ఏప్రిల్‌ రెండో వారంలో నెల్లూరు కోర్టులో జరిగిన ఫైళ్ల దొంగతనం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అప్పుడే మంత్రి అయిన కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి సంబంధించిన ఒక ఫోర్జరీ కేసులో కీలక డాక్యుమెంట్లు కోర్టు పరిసరాల్లోని డ్రైనేజీలో కనిపించడం దుమారం రేపింది. దీనిపై దర్యాప్తు చేసిన నెల్లూరు పోలీసులు 12వేల సీసీ కెమెరాలను పరిశీలించి ఇనుప తుక్కు తస్కరించే ఇద్దరు దొంగలు ఆ పని చేసినట్లు తేల్చారు. జిల్లా ఎస్పీ విజయారావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి దొంగతనానికి వచ్చిన ఇద్దరిని చూసి కుక్కలు అరవడంతో భయపడి వారు కోర్టులోకి పరుగులు తీసినట్లు చెప్పారు. అక్కడి బీరువా బద్దలుకొట్టి మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు కొన్ని ఎలక్ర్టానిక్‌ పరికరాలు ఎత్తుకెళ్లినట్లు వివరించారు. కొన్నాళ్ల పాటు సోషల్‌ మీడియాలో ఇదే బాకా వైరల్‌ అయింది. నెల్లూరు జిల్లా మంత్రికి సంబంధించిన కేసులో ఎస్పీ వ్యాఖ్యల వీడియోలను వైరల్‌ చేస్తూ ‘కాసేపు నవ్వుకోండి’ అంటూ కొందరు ట్యాగ్‌ లైన్‌ తగిలించారు. 


సూపర్‌ హిట్‌ కథనం..

జగనన్న మంత్రివర్గంలో సభ్యుడికి పోలీసులు ఆ మాత్రం అండగా నిలవరా.? అంటూ సెటైర్లు వేసే వారికి సైతం కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు తీరు షాకిచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న ఎమ్మెల్సీ అనంతబాబు వద్ద పనిచేసిన డ్రైవర్‌ సుబ్రమణ్యం మే రెండో వారంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. కుటుంబసభ్యులు ఎమ్మెల్సీపై అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారం సంచలనం సృష్టించడంతో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కాకినాడ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. మౌఖిక సాక్ష్యాలతోపాటు సాంకేతిక పరమైన ఆధారాలు, ఫోరెన్సిక్‌ నివేదికలు తీసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు విలేకరుల ముందుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన కథ సోషల్‌ మీడియాలో సూపర్‌ హిట్‌ అయింది. రాత్రి పొద్దుపోయేదాకా స్నేహితులతో కలిసి మద్యం తాగుతున్న డ్రైవర్‌ సుబ్రమణ్యంకు ఎమ్మెల్సీ అనంతబాబు బుద్ధిమాటలు చెప్పారట! మద్యం అతిగా తాగి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పడంతో అతడు ఎదురు తిరిగాడట! ఈ క్రమంలో ఎమ్మెల్సీ నెట్టివేయడంతో డ్రైవర్‌ సుబ్రమణ్యం కింద పడిపోయాడంటూ ఎంతో కష్టపడి స్ర్కిప్ట్‌ వినిపించారు. అదే సమయంలో ఇనుప చువ్వ గుచ్చుకుందని, ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు ప్రాణాలు కోల్పోయాడని వివరించారు. పోలీసుశాఖలో సమర్థులైన అధికారుల జాబితా తీస్తే కచ్చితంగా పేరుండే రవీంద్రనాథ్‌ బాబు అలా చెప్పడం చూసి పోలీసులే విస్తుపోయారు. మఖ్యమంత్రికి అత్యంత సన్నిహిత ఎమ్మెల్సీ విషయంలో జిల్లా పోలీసు అధికారి అంతకన్నా మాట్లాడటం సాధ్యం కాదులే అనే వ్యాఖ్యలు వినిపించాయి. 


నగ్న.. సత్యమే అయినా..

అధికార పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఒక మహిళకు వీడియోకాల్‌ చేసి ఒంటిపై నూలుపోగు లేకుండా తన అంతర్గత భాగాలను చూపించిన వీడియో ఏకంగా ప్రభుత్వాన్నీ, వైసీపీనీ షేక్‌ చేసింది. గత వారం రోజులు గా దేశ వ్యాప్తంగా సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయింది. ఈ డర్టీ వీడియో వ్యవహారంలో వివరాలను వెల్లడిస్తూ బుధవారం అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప పడిన ప్రయాస అంతాఇంత కాదు. అనంతపురంలో ఏ పోలీసు అధికారిని అడిగినా మాధవ్‌ నైజం ఏమిటో చెబుతారు. నిజానికి, అంతర్గత విచారణలో ఆ వీడియోపై నిజాలు పోలీసులకు తెలిశాయి. కానీ మీడియా ముందు మాత్రం అది ఒరిజినల్‌ వీడియో కాదని చేతులు ఎత్తేశారు.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ఆంధ్రప్రదేశ్ Latest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.