50 వేల లీటర్ల మద్యం నేలపాలు...!

ABN , First Publish Date - 2020-09-27T01:46:05+05:30 IST

నిల్వ చేయడంలో లోపాల కారణంగా 50 వేల లీటర్ల రెడ్ వైన్ నేలపాలైంది. స్పెయిన్‌లోని విల్లమేలియా అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇంత మద్యం వ్యవర్థమవడంతో చూస్తున్నవారికి నోట మాట రాలేదు.

50 వేల లీటర్ల మద్యం నేలపాలు...!

ఫ్రాన్స్: మద్యం నిల్వ చేయడంలో లోపాల కారణంగా 50 వేల లీటర్ల రెడ్ వైన్ నేలపాలైంది. స్పెయిన్‌లోని విల్లమేలియా అనే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఇంత మద్యం వ్యర్థమవడంతో చూస్తున్నవారికి నోట మాట రాలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మద్యం నిల్వ ఉంచే పెద్ద కంటెయినర్‌లో లీక్ కారణంగా రెడ్ వైన్ నేలపాలైనట్టు తెలుస్తోంది. దాదాపు 50 వేల లీటర్లు వ్యర్థమైనట్టు స్థానిక మీడియా చెబుతోంది.


కంటెయినర్‌లు ఉన్న ప్రాంతమంతా మద్యం సరస్సును తలపిస్తోందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.  అయితే ఇటువంటి ఘటనలు గతంలోనూ అనేకం జరిగాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఈ ఏడాది జనవరిలో జరిగిన ప్రమాదంలో ఏకంగా 3.5 లక్షల లీటర్లకు పైగా క్యాబర్నే సోవిన్యాన్ మద్యం నీళ్ల పాలైంది. దాన్ని నిల్వ ఉంచిన కంటెయినర్ ఒక్కసారిగా బద్దలవడంతో మద్యం మొత్తం సమీపంలోని రష్యాన్ నదిలో కలసిపోయింది. 

Updated Date - 2020-09-27T01:46:05+05:30 IST