మరచిపోలేని వ్యక్తి అమ్మ

ABN , First Publish Date - 2022-05-07T05:30:00+05:30 IST

మరచిపోలేని వ్యక్తి అమ్మ

మరచిపోలేని వ్యక్తి అమ్మ


  • సృష్టిలో తీయని పిలుపు అమ్మ  ఫ నేడు మదర్స్‌ డే 

రంగారెడ్డి అర్బన్‌, మే 7: అమ్మంటే ప్రేమకు ప్రతిరూపం. జన్మజన్మల బంధం. అమ్మ ప్రేమను మించి ఈ సృష్టిలో మరోటి లేదు. మాతృ దినోత్సవం అంటే ఒక్క రోజు సంబరం కాదు. బిడ్డల ఎదుగుదల కోసం కష్టపడే అమ్మను రోజూ పూజించినా తక్కువే. ఆజన్మాంతం రుణపడి ఉండాలి. ప్రతి బిడ్డకూ తల్లే మొదటి స్నేహితురాలు.. సంరక్షకురాలు. ఇలా అన్నీ అమ్మ తర్వాతే. అమ్మను మించిన దైవం లేదు. ప్రతి బిడ్డకూ తల్లితో ఉండే బంధం ప్రత్యేకమైనది. అనిర్వచనీయమైంది. ప్రతి ఒక్కరికీ మరిచిపోలేని మధుర జ్ఞాపకాల ఘని అమ్మ. ఈ ప్రాముఖ్యతను గుర్తించే ప్రపంచ వ్యాప్తంగా మాతృ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అమ్మంటే ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమ్మదనం, తీయదనం.. ఇలా ఎన్నెన్నో..! ఎంత చెప్పినా తక్కువే.. మాటల్లో వర్ణించలేనిది అమ్మ ప్రేమ. సంతానం విషయంలో అమ్మ ఓ సైటిస్టు, సైకాలజిస్టు, డాక్టరు, టీచరు, బ్యాంకరు, స్నేహితురాలు.. ఇలా అన్ని విషయాల్లోనూ బతికున్నంత వరకూ మనకు తోడుండేది అమ్మ. అలాంటి అమ్మకు ప్రతి బిడ్డా రోజూ తమ ప్రేమను పంచాలి, గౌరవించాలి. ఆదివారం మదర్స్‌ డే. తల్లి విలువను చాటేందుకు నిర్వహించే సుదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ వ్యక్తి తమ తల్లి పడిన కష్టాలను, చేసిన త్యాగాలను మరోసారి గుర్తుచేసుకొని ఆమెను ఆరాధనాభావంతో కొలవాల్సిన తరుణం.

Read more