ఎన్టీఆర్ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న టీడీపీ నేతలు
కడప, జనవరి 18(ఆంధ్రజ్యోతి) : పేదరికం లేని సమాజం నిర్మించేందుకు దివంగత ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని టీడీపీ నేతలు లక్ష్మిరెడ్డి, గోవర్థన్‌రెడ్డి, హరిప్రసాద్ కొనియాడారు. ఎన్టీఆర్ 26వ వర్థంతిని పురస్కరించుకొని మంగళవారం కొండాయపల్లెలో మన్నెంచలపతి నాయుడు ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. ఈ సందర ్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి అయ్యాక కిలో బియ్యం రెండు రూపాయలకే అందించారన్నారు.