సారవకోట (జలుమూరు): టీడీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మండలంలో ఇప్పటి వరకు నిర్వహించిన ‘బాదుడే-బాదుడు’ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం నాయకులతో సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రప్రభుత్వం అన్ని రకాల ధరల తో పాటు ఆర్టీసీ, విద్యుత్ చార్జీలను పెంచి అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోం దన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని కోరారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు కత్తిరి వెంకటరమణ, నాయకులు ధర్మాన తేజకుమార్, సురవరపు తిరుపతిరావు, సాధు చిన్నికృష్ణంనాయుడు, బైరి భాస్కరరావు, నాగరాజు, పట్ట ఉమామహేశ్వరరావు, బగ్గు గోవిందరావు పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.