అనుకోని అతిథులు

ABN , First Publish Date - 2022-06-24T04:50:20+05:30 IST

మండల పరిధిలోని పలు గ్రామాల్లో నల్లకొంగలు చూపరులకు కనువిందు

అనుకోని అతిథులు
నందివనపర్తిలోని పొలాల్లో తిరుగుతున్న నల్లకొంగలు

యాచారం, జూన్‌ 23 : మండల పరిధిలోని పలు గ్రామాల్లో నల్లకొంగలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. ఈ నల్లకొంగలు ఎక్కడి నుంచి వచ్చాయో గానీ పొలాల్లో తిరుగుతూ కీటకాలు తింటూ సందడి చేస్తున్నాయి. సాధారణంగా తెల్లకొంగలు కన్పిస్తాయి. కానీ ఇక్కడికి వచ్చిన పొడవాటి ముక్కు కలిగిన నల్ల కొంగలను రైతులు, గ్రామస్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.



Updated Date - 2022-06-24T04:50:20+05:30 IST