టిక్‌టాక్‌కు తగ్గని ఆదరణ

ABN , First Publish Date - 2021-07-17T06:20:09+05:30 IST

భారత్‌ సహా పలు దేశాలు బహిష్కరించినప్పటికీ ‘టిక్‌టాక్‌’కు ఆదరణ తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి.

టిక్‌టాక్‌కు తగ్గని ఆదరణ

భారత్‌ సహా పలు దేశాలు బహిష్కరించినప్పటికీ ‘టిక్‌టాక్‌’కు ఆదరణ తగ్గలేదని గణాంకాలు చెబుతున్నాయి. దీనిని ఇప్పటి వరకు మూడు వందల కోట్ల మంది డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు అనలిటిక్స్‌ సంస్థ ‘సెన్సర్‌ టవర్‌’ తెలిపింది. ఈ మైలురాయిని చేరుకున్న తొలి ఫేస్‌బుక్‌ యేతర, తొలి గేమ్స్‌ యేతర యాప్‌ ఇది ఒక్కటే. టిక్‌టాక్‌ డౌన్‌లోడ్స్‌ పెరుగుదల ఏటా 38 శాతంగా నమోదవుతోంది. గత ఏడాది మొదటి ఆరు నెలలోనే ఆరుకోట్లపైగా డౌన్‌లోడ్స్‌ నమోదయ్యాయి. వినియోగదారుల వ్యయం 73 శాతం మేర పెరిగింది. 2014 జనవరి తరవాత ఒక బిలియన్‌ డాలర్ల స్థూల మొత్తంగా రెవెన్యూ పొందిన నాన్‌ గేమింగ్‌ యాప్స్‌ 16 మాత్రమే. అందులో అయిదింటిలో టిక్‌టాక్‌ ఒకటికాగా, టిండర్‌, యూట్యూబ్‌, నెట్‌ఫ్లిక్స్‌, టెన్సెంట్‌ వీడియో మిగిలినవి.

Updated Date - 2021-07-17T06:20:09+05:30 IST