పత్తాలేని పథకాలు!

ABN , First Publish Date - 2022-05-02T06:58:10+05:30 IST

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు సంక్షేమ పథకా లకు ఢోకా లేదన్న రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లాలో గడిచిన ఐదేళ్ల నుంచి నేటి వరకు సంక్షేమ పథకా ల అమలు అంతంత మాత్రంగానే ఉంది. మరికొన్ని సంక్షేమ పథకాలైతే ప్రజలకు అందకుండా పత్తాలేకుండా పోయాయి.

పత్తాలేని పథకాలు!
నిర్మాణం పూర్తయినా.. పంపిణీ చేయని కేఆర్‌కే కాలనీలోని డబుల్‌బెడ్‌రూంలు

జిల్లాలో అమలుకు నోచుకోని ప్రభుత్వ హామీలు

అటకెక్కిన గొర్రెల పంపిణీ పథకం

బీసీలకు అందని రుణాలు

కొత్త పింఛన్ల కోసం తప్పని ఎదురుచూపులు

నిరుపేదలకు నీడనివ్వని డబుల్‌బెడ్‌రూం ఇళ్లు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

ఆదిలాబాద్‌ టౌన్‌, మే 1: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు సంక్షేమ పథకా లకు ఢోకా లేదన్న రాష్ట్ర ప్రభుత్వం.. జిల్లాలో గడిచిన ఐదేళ్ల నుంచి నేటి వరకు సంక్షేమ పథకా ల అమలు అంతంత మాత్రంగానే ఉంది. మరికొన్ని సంక్షేమ పథకాలైతే ప్రజలకు అందకుండా పత్తాలేకుండా పోయాయి. పథకాల ప్రారంభంలో హడావుడిగా లబ్ధిదారులను ఎంపిక చేసి మరీ అందజేసినప్పట్టికీ..  ప్రస్తుతం ఆ పథకాలు కనుమరుగయ్యాయి. ప్రభుత్వ పథకాల అమలు లో ఎంతో జాప్యం జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు పథకాలను ప్రారంభిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి నా.. ఇప్పటికీ ప్రారంభం కాలేదు. గత అసెంబ్లీ సమావేశాల్లో ఏప్రిల్‌ నుంచే రెండు కీలక పథకాలకు శ్రీకారం చుడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిలో ఆసరా పింఛన్లకు అర్హత వయస్సు తగ్గింపు ఒకటైతే, రెండోది సొంత స్థలం ఉన్న వారికి రూ.3లక్షల ఆర్థిక సహాయం. ఈ రెండు పథకాల అమలులో ఇప్పటి వరకు ఎలాంటి ముందడుగు పడలేదు. మార్గదర్శకాలు, విధివిఽదానాలు ఖరారు దశలోనే నిలిచిపోయాయి.   స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటిచండంతో సంబరపడ్డ లబ్ధిదారులు నెల గడిచినా.. ప్రారంభం ఎప్పుడా? అని ఎదురు చూడక తప్పడం లేదు. వృద్ధాప్య పింఛన్ల అర్హత వయస్సును 65 నుంచి 57ఏళ్లకు తగ్గిస్తామని  2018 ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చింది. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిని అమలు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఆచరణలోకి తేలేదు.

ఏడాదే కొనసాగిన గొర్రెల పంపిణీ

రాష్ట్ర ప్రభుత్వం 2017లో ప్రారంభించిన గొర్రెల పథకం ఒక యేడాది మాత్రమే కొనసాగింది. 2018-19 నుంచి ఈ పథకం జాడ లేకుండా పో యింది. మొదటి విడతలో జిల్లావ్యాప్తంగా 4,823మందికి అప్పటి మంత్రి జోగు రామన్న చేతుల మీదుగా గొర్రెలు పంపిణీ చేశారు. ఈ పథకానికి గాను రెండో విడత 2018-19 గానూ జిల్లావ్యాప్తంగా 4,600 పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,317 మందికి గొర్రెలు పంపి ణీ చేస్తున్నట్లు ఎంపిక చేశారు. మిగిలిన 3,283 మంది ఇంకా రెండో విడ త ఎప్పుడు? ప్రారంభమవుతుందని ఎదురు చూస్తున్నారు. వీరి నుంచి ఇప్పటికే అధికారులు రూ.30,500 తీసుకున్నట్లు లబ్ధిదారులు చెబుతున్నా రు. ఇదిలా ఉంటే జిల్లావ్యాప్తంగా గూడు, నీడ లేని నిరుపేదలకు డబుల్‌బెడ్‌రూం ఇళ్లు కట్టి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, అధికారులు బోథ్‌ నియోజకవర్గంలోని తాంసి మండలంలో గల బండల్‌నాగాపూర్‌, ఆదిలాబాద్‌ నియోజకవర్గంలోని జైనథ్‌ మండలకేంద్రంలో తప్ప ఎక్కడా కూడా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగు రామన్న నియోజకవర్గంలోని జైనథ్‌ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పూర్తయినా.. అధికారులు పంపిణీ చేయకపోవడం తో కొందరు పేదలు గృహ ప్రవేశం చేసి అందులోనే నివసిస్తున్నారు. ఈ పథకంలో నీడలేని నిరుపేదలకు ఎప్పుడు ఇళ్లు ఇస్తారో?నని జిల్లా వ్యాప్తంగా నిరుపేదలు వేల సంఖ్యలో ఎదురు చూస్తున్నారు. మరికొంత మంది అధికారులు, ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

జాడలేని ఆసరా కొత్త పింఛన్లు

జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 67వేల మంది పింఛన్లు అందుకుంటున్నారు. ఇందులో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత, బీడీ, చేనేత కార్మికులున్నారు. అయితే 2018 ఎన్నికల నేపథ్యంలో ఆసరా పింఛన్ల వయస్సును 60 ఏళ్ల పింఛన్‌ వయస్సు నుంచి 57 ఏళ్లకు కుదించింది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వస్తే అందరికీ పెంచిన పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. కాని నేటి వరకు నాలుగేళ్లు గడుస్తున్నా.. కొత్త పింఛన్లకు అతీగతి లేదు. జిల్లావ్యాప్తంగా గత అక్టోబర్‌ 31 వరకు 17వేల మంది 57ఏళ్లు నిండిన వృద్ధులు ఆసరా పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పింఛన్ల సంఖ్య ప్రస్తుతం 20వేల వరకు చేరుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. 2018లో ఇచ్చిన కొత్త పింఛ న్ల హామీ ఇప్పటికీ అమలుకాక పోవడంతో జిల్లాలోని లబ్ధిదారులు మండిపడుతున్నారు. 

బీసీ రుణాల ఊసే లేదు

నీళ్లు, నిధులు, నియమకాలు, నిరుపేద ప్రజలకు ఆర్థిక రుణాలు అన్న పేరుతో ఏర్పడిన ప్రత్యేక రాష్ట్రంలో బీసీలు అత్యంత అన్యాయానికి గురవుతున్నారని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2014-15, 2015-16లో బీసీలకు వ్యక్తిగత, స్వయం రు ణాలను అందించింది. ఇందులో 4వేల పైచిలుకు మంది బీసీలు వ్యక్తిగత రుణాలకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ రుణాలలో అత్యధికంగా అధికా రిక పార్టీకి చెందిన వారికి మాత్రమే రుణాలు అందించినట్లు ఆరోపణలు సైతం వచ్చాయి. అనంతరం ఈ రుణాలు జిల్లాలో ముందుకు సాగని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు 2016 నుంచి బీసీలు జిల్లా వెనుకబడిన తరగతుల శాఖలో దరఖాస్తు చేసుకున్న వారు సుమారు 10వేల మంది లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తుంది. 2018 ఎన్నికల అనంతరం బీసీ లబ్ధిదారులు రూ.10లక్షలు, రూ.8లక్షలు, రూ.6లక్షలు, రూ.5లక్షలు, రూ.2లక్ష లు, రూ.లక్ష రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో కేవలం రూ.లక్షకు దరఖాస్తు చేసుకున్న కొద్దిమందికి మాత్రమే రూ.50వేల చొ ప్పున అందజేశారు. అంతే తప్ప ఇప్పటికీ బీసీల రుణాల ఊసే లేకుండా పోయింది. ప్రభుత్వం బీసీలకు స్వయం ఉపాధి రుణాలు ఎప్పుడు ఇస్తుం దో?నని లబ్ధిదారులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు.  ఇలా జిల్లా వ్యాప్తంగా మరెన్నో పథకాలు ప్రారంభించి సంవత్సరం, రెండు సంవత్సరాల లోపే కనుమరుగైనవి ఎన్నో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో దళితబస్తీ భూముల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు దళితబంధతో అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం ఎ న్నికలకు ముందు హంగు ఆ ర్భాటాలతో పథకాలు ప్రారంభించి ఊసురు మనిపించకుండా అర్హులైన లబ్ధిదారులకు పథకాలను అందేలా చూడాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2022-05-02T06:58:10+05:30 IST