పత్తాలేని రేషన్‌

ABN , First Publish Date - 2021-01-16T05:28:45+05:30 IST

పాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసి రెండేళ్లు గడు స్తున్నా సరైన వసతులు కల్పించక పోవడంతో ఇబ్బందులే ఎదురవు తున్నాయి. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలకు గాను 229 తండాలు, గూడాలు కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రం చుట్టు ఉన్న 5 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమయ్యా యి. కొత్త పంచాయతీలు ఏర్పడితే తమ బాధలు దూరమవుతాయని భావించిన గ్రామస్థులకు అవే కష్టాలు ఎదురవుతున్నాయి.

పత్తాలేని రేషన్‌
రేషన్‌ సరుకులను కాలినడకన మోసుకెళ్తున్న రాజులవాడి గ్రామస్థులు

కొత్త పంచాయతీలలో జాడలేని రేషన్‌ షాపులు

సరుకుల కోసం కిలో మీటర్ల మేర కాలినడక

ప్రతిపాదనలు పంపి ఏడాదైనా స్పందన కరువు

పట్టించుకోని పాలకులు.. అధికారులు

ఆదిలాబాద్‌, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): పాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసి రెండేళ్లు గడు స్తున్నా సరైన వసతులు కల్పించక పోవడంతో ఇబ్బందులే ఎదురవు తున్నాయి. జిల్లాలో 467 గ్రామ పంచాయతీలకు గాను 229 తండాలు, గూడాలు కొత్త గ్రామపంచాయతీలుగా ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రం చుట్టు ఉన్న 5 గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలో విలీనమయ్యా యి. కొత్త పంచాయతీలు ఏర్పడితే తమ బాధలు దూరమవుతాయని భావించిన గ్రామస్థులకు అవే కష్టాలు ఎదురవుతున్నాయి. కొత్త పంచాయతీ ఏర్పడిందన్న సంబరమే తప్ప.. ఎలాంటి వసతులకు నోచుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏడాది క్రితమే సీఎం కేసీఆర్‌ కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలన్నింటిలో రేషన్‌ షాపులను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయినా ఇప్పటి వరకు ఆచరణ సాధ్యమే కావడం లేదు. జిల్లాలో ప్రస్తుతం 355 రేషన్‌ దుకాణాలున్నాయి. మరో 112 రేషన్‌ షాపుల మంజూరుకు జిల్లా అధి కారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా కదలికే కనిపించడం లేదు. దీంతో గతంలో మాదిరిగానే కిలో మీటర్ల మేర ఇతర గ్రామాల నుంచి రేషన్‌ సరుకులను తెచ్చుకోవాల్సి వస్తోంది. జిల్లాలో అధికంగా మారుమూల గిరిజన గ్రామాలే ఉన్నాయి. ఉదహారణకు... భీంపూర్‌ మండలం గొల్లఘాట్‌ గ్రామం రెండేళ్ల క్రితం కొత్త గ్రామ పంచా యతీగా ఏర్పడింది. ఈ గ్రామంలో రేషన్‌షాపు లేకపోవడంతో నాలుగు కిలో మీటర్ల దూరంలో ఉన్న తాంసి(కె) గ్రామం నుంచి రేషన్‌ సరుకులను తెచ్చుకునే పరిస్థితి ఏర్పడుతోంది. ఇలా జిల్లాలో మరెన్నో గ్రామాల్లో ఇవే ఇబ్బందులు కనిపిస్తున్నాయి. గ్రామానికి వచ్చిన అధికారులు పాలకులను నిలదీసినా ఫలితం లేకుండా పోతుం దని పేర్కొంటున్నారు. గిరిజన గ్రామాల ప్రజలు రేషన్‌ సరుకుల కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఇప్పటికే కొత్త పంచాయ తీలలో పాత ఇబ్బందులే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పంచాయతీ భవనం లేకపోవడంతో గ్రామంలో ఉన్న గుడి, బడి, అంగన్‌వాడీ, కుల సంఘాల భవనాలలోనే గ్రామ పంచాయతీలు కొనసాగుతున్నాయి. పల్లె ప్రగతి పరుగులు తీస్తోందని ప్రభుత్వం ప్రచార ఆర్భాటాలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకొని సమ స్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

ప్రతి నెలా ఇవే ఇబ్బందులు..

మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు ప్రతి నెలా ఇవే ఇబ్బం దులు ఏర్పడుతున్నాయి. ప్రతినెలా రేషన్‌ సరుకుల కోసం కిలో మీటర్ల మేర కాలినడకన వెళ్లి సరుకులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడు తోంది. కొందరు ఎడ్లబండ్లు, ట్రాక్టర్‌, ఆటోలపై సరుకులను తెచ్చుకుం టుండగా ఎలాంటి ఆధారం లేని నిరుపేద ప్రజలు నెత్తిన మోసుకెళ్తూ కాలినడకన వెళ్తున్నారు. ఏజెన్సీ మారుమూల గిరిజన గ్రామాలకు దారులు కూడా సరిగా లేక పోవడంతో ఒర్రెలు, గుట్టలు దాటుతూ సరుకుల కోసం అష్ట కష్టాలు పడుతున్నారు. వేసవి, శీతా కాలంలో కాలినడకన వెళ్తున్న వర్షాకాలంలో మాత్రం నడవలేని పరిస్థితలు ఏర్పడుతున్నాయి. దీంతో కొందరు రేషన్‌ సరుకులను వదిలేస్తున్నారు. ఇచ్చేది రూపాయికి కిలో బియ్యమైతే వాటిని తెచ్చుకునేందుకు రూ.20 నుంచి రూ.30 వరకు ఖర్చు చేయాల్సి వస్తుందని చెబుతు న్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని స్థానికంగానే రేషన్‌ సరుకులను సరఫరా చేయాలని కోరుతున్నారు.

ఏర్పాటుపై సందిగ్ధం..

కొత్తగ్రామ పంచాయతీలలో రేషన్‌ షాపులను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌ ఉన్న అన్ని గ్రామాల్లో రేషన్‌ దుకాణాలను ఏర్పాటు చేయ డం సాధ్యపడదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జిల్లాలో 250 నుంచి 300 జనాభా ఉన్న తండాలు, గుడాలను కొత్త గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఇలాంటి గ్రామాల్లో 50-60 రేషన్‌కార్డులు మాత్రమే ఉన్నాయి. అయితే కార్డుల సంఖ్య తక్కువగా ఉంటే రేషన్‌ దుకాణాల నిర్వహణ భారమయ్యే అవకాశం ఉండడంతో ఎవరు ముందుకురారనే అభిప్రాయాలు అధికారుల్లో వ్యక్తమవుతు న్నాయి. కనీసం 400 నుంచి 500 వరకు రేషన్‌కార్డులుంటేనే షాపులను నడిపించే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన అధిక గ్రామాలు దాదాపుగా 500 జనాభాలోపే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో రేషన్‌ షాపుల ఏర్పాటుపై సందిగ్ధ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం అడిగిన వెంటనే ప్రతిపా దనలు పంపించిన రేషన్‌ షాపుల ఏర్పాటుపై ప్రభుత్వం పునరా లోచనలో పడినట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-01-16T05:28:45+05:30 IST