మోదీ, కేసీఆర్‌ మధ్య అవగాహన

ABN , First Publish Date - 2022-07-05T08:00:33+05:30 IST

ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల మధ్య పరస్పర అవగాహన ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

మోదీ, కేసీఆర్‌ మధ్య అవగాహన

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలు

కాంగ్రెస్‌లో చేరిన బడంగ్‌పేట్‌ టీఆర్‌ఎస్‌ మేయర్‌, కార్పొరేటర్లు

రాహుల్‌ గాంధీతో భేటీ అయిన నేతలు


న్యూఢిల్లీ, జూలై 4 (ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల మధ్య పరస్పర అవగాహన ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒకరి తప్పులను మరొకరు లే వనెత్తకుండా ఇద్దరూ కలిసి ప్రజలను మోసగించేందుకు ప్ర యత్నిస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ అభివృద్ధిలో, దేశాన్ని కాపాడే విషయంలో ఆ రెండు పార్టీలు ఉపయోగపడవని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గ్రహించిన ఆ పార్టీల నేతలు అనేక మంది కాంగ్రె్‌సలో చేరడానికి ముందుకొస్తున్నారని, వా రిని తాము ఆహ్వానిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్య, చిన్నపిల్లలపై జరుగుతున్న దాడులు, హత్యాచారాలపై టీఆర్‌ఎస్‌ పార్టీని ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ కార్యవర్గం ఎందుకు ప్రశ్నించలేదని రేవంత్‌ నిలదీశారు. సీఎం కేసీఆర్‌ కూడా రాష్ట్ర విభజన చట్టం లో పేర్కొన్న హామీలపై ప్రధానిని ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. సోమవారం ఢిల్లీలోని రాహుల్‌ గాంధీ నివాసం లో టీఆర్‌ఎ్‌సకు చెందిన బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పారిజాత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు సుదర్శన్‌రెడ్డి, సంతోష శ్రీనివా్‌సరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.


వారికి రేవంత్‌రెడ్డి కాం గ్రెస్‌ కండువాలను కప్పారు. తర్వాత రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యారు. అనంతరం రేవంత్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కిరాయి మనుషులతో హడావుడి చేసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించాలని బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు పోటీపడుతున్నాయని ఆరోపించారు. కేసీఆర్‌తో ఎంత కాలం పనిచేసినా ప్రజా సమస్యలను పరిష్కరించే పరిస్థితి లేదని ప్రజాప్రతినిధులు గ్రహిస్తున్నారని, కాంగ్రె్‌స ను అధికారంలోకి తీసుకొచ్చి తమ ప్రాం తాలను అభివృద్ధి చేసుకోవాలని భావిస్తున్నారని వివరించారు.  హైదరాబాద్‌ ను విశ్వనగరం చేస్తామన్న టీఆర్‌ఎస్‌ నేతలు.. చివరికి రోడ్లపై గుంతలు కూ డా పూడ్చలేని పరిస్థితిలో ఉన్నారని వి మర్శించారు. ఇలాంటి సందర్భంలో బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాత నరిసంహారెడ్డి  కాంగ్రె్‌స తోనే హైదరాబాద్‌ అభివృద్ధి సాధ్యమని నమ్మి, ఇతర కార్పొరేటర్లతో కలిసి పార్టీలో చేరారని చెప్పారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రాష్ట్రాన్ని కాపాడే బాధ్యతను తాము తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో ఇకపై పెద్ద ఎత్తున కాంగ్రె్‌సలో చేరికలు ఉంటాయన్నారు. 


అల్లూరి, పింగళి, రోశయ్యలకు నేతల నివాళి

హైదరాబాద్‌: అల్లూరి సీతారామరాజు, మాజీ సీఎం కొణిజేటి రోశయ్యల జయంతి, పింగళి వెంకయ్య వర్థంతి సందర్భంగా సోమవారం గాంధీభవన్‌లో వారి చిత్ర పటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు జగ్గారెడ్డి, మహే్‌షకుమార్‌గౌడ్‌, సీనియర్‌ ఉపాధ్యక్షులు కుమార్‌రావు, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T08:00:33+05:30 IST