పెంపుడు జంతువులను అర్థం చేసుకోండిలా...

ABN , First Publish Date - 2022-05-18T06:34:08+05:30 IST

ఫోన్‌ పట్టుకుని బిజీగా ఉంటే పెట్‌కు నచ్చకపోవచ్చు. వాటి చేష్టలను బట్టి సులువుగా అర్థం చేసుకోవచ్చు. తోకను ఊపుతూ..

పెంపుడు జంతువులను అర్థం చేసుకోండిలా...

జంతువులు శరీర కదలికలతో ఏవో విషయాలు మనకు చెప్పాలనుకుంటాయి. అయితే అవీ అంత సులువుగా అర్థం కావు. పెట్స్‌ను ప్రేమించినప్పుడే వాటి ఎమోషన్స్‌ అర్థం చేసుకోగలం. అసలు మీ ఇంట్లోని పెట్‌ మీతో ఏం చెప్పాలనుకుంటోంది? ఏ విషయం అడగటానికి ప్రయత్నిస్తోందనే విషయాల్ని కొన్ని కదలికలద్వారా కనుక్కోవచ్చు.

ఫోన్‌ పట్టుకుని బిజీగా ఉంటే పెట్‌కు నచ్చకపోవచ్చు. వాటి చేష్టలను బట్టి సులువుగా అర్థం చేసుకోవచ్చు. తోకను ఊపుతూ.. తన తోకను చేజ్‌ చేసినట్లు రౌండ్‌ తిరుగుతుంటే ‘నన్ను పట్టించుకో. నాతో ఆడు’ అని అర్థం. లేదా దానికి బోరింగ్‌గా కూడా ఉండొచ్చు. పిచ్చి చేష్టలు చేస్తుంటే నెగటివ్‌ మైండ్‌ ఉందని తెలుసుకోవాలి.

కుక్కపిల్ల తన అమ్మ ముఖాన్ని నాకుతుంటే ఆకలిగా ఉందని అర్థం. అలానే ఇంట్లో యజమానిని నాకటానికి ప్రయత్నిస్తుంటే.. తిండి పెట్టమని అడుగుతోందని అర్థం చేసుకోవాలి. 

మీ ఇంట్లో పిల్లి మీకు కిస్‌ పెడుతుంటే ఒక్కోసారి తప్పుగా అర్థం చేసుకుంటారు. నాలుకతో టచ్‌ చేస్తుంటే ప్రేమ చూపుతుందని అర్థం చేసుకోవచ్చు. లేదా తనకు తాను ఓదార్పు కోరుకుంటోందని అర్థం. ఎక్కువగా యజమానిని నాకటానికి ప్రయత్నిస్తోంటే.. కచ్చితంగా ఒత్తిడి వల్ల ఆ పెట్‌ అలా బిహేవ్‌ చేస్తుందని తెల్సుకోవాలి. ఇక పక్షుల విషయానికొస్తే ఒత్తిడిగా ఉంటే ఎక్కువగా అరుస్తాయి. ఒక్కోసారి తన రెక్కలను తాను పొడుచుకుంటాయి. ఈకలను విదుల్చుకుంటాయి.

కుక్క తోకను ముందుకు వెనకకు కదిలిస్తుంటే ఏదో చూసిందని అర్థం. లేదా కొత్త వ్యక్తి దగ్గరకు వస్తున్నాడని అర్థం. లేదా ఆ వ్యక్తిని అవాయిడ్‌ చేస్తున్నాయని అర్థం. కుక్క తన తోకను మడత పెట్టడం, పిల్లి తన తోకను చుట్టినట్లుండి తన చుట్టూ తాను తిరగటం. తోకను క్వశ్చన్‌ మార్క్‌లా చేశాయంటే చర్మంపై దురదగా ఉందని అర్థం. 

తన స్థలంలో పడుకోకుండా కార్పెట్‌ ఏరియాలో పెట్‌ పడుకుంటే డీహైడ్రేషన్‌ అయిందని తెలుసుకోవాలి. 

మనకు కోపమొస్తే ఐకాంటాక్స్‌ ఇవ్వం. కోప్పడతాం. డాగ్స్‌ కూడా అంతే.. ఐ కాంటాక్ట్‌ ఇవ్వవు. అవాయిడ్‌ చేసినట్లు దూరంగా వెళ్తాయి. అపుడు తనను పట్టించుకోలేదని తెలుసుకోవాలి. వెంటనే క్లోజ్‌గా మెలగాలి. తనకు ఇష్టమైన ఆహారం ఇవ్వాలి. అప్పుడు ఆ పెట్‌ కూల్‌ అవుతుంది.

దాక్కోవడం లేదా రిలాక్స్‌గా మనుషుల నుంచి దూరంగా వెళ్లి పడుకోవడం చేస్తుంటే పెట్‌ ఒంటరిగా ఉండాలని 

కోరుకుంటోందని అర్థం. అలాంటప్పుడు వాటిని కొద్దిసేపు వదిలేయాలి.

ఆకాశం ప్రశాంతంగా ఉందని మనం అనుకోవచ్చు. అయితే వర్షం పడుతుందనే విషయం డాగ్‌కి ముందే తెలిసిపోతుంది. వాతావారణ మార్పులను స్మెల్‌ చేయగల సామర్థ్యం వాటికి ఉంటుంది. కుక్కల సైకాలజీ, బిహేవియర్‌ మీద పరిశోధనలు చేసిన ఇన్‌స్టిట్యూట్స్‌ చెప్పే విషయమేంటంటే.. భూకంపం వస్తుందనే విషయం వాటికి ఇరవై గంటల ముందే తెలిసిపోతుందట. 

కుక్క లేదా పిల్లి డ్యాన్స్‌ చేసినట్లు కదలటం.. దగ్గరగా వచ్చి వాటి చర్మంతో యజమానిని రుద్దడం చేస్తే  ప్రేమను కనబరుస్తున్నాయని అర్థం చేసుకోవాలి. 

Updated Date - 2022-05-18T06:34:08+05:30 IST