వైసీపీ పాలనలో.. మైనారిటీలకు అన్యాయం: ఫారూఖ్ షుబ్లీ

ABN , First Publish Date - 2021-09-17T19:28:47+05:30 IST

విజయవాడ: వైసీపీ పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని, ఎక్కడా న్యాయం జరగలేదని మైనారిటీ హక్కులు, పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప జిల్లాలోని

వైసీపీ పాలనలో.. మైనారిటీలకు అన్యాయం: ఫారూఖ్ షుబ్లీ

విజయవాడ: వైసీపీ పాలనలో మైనారిటీలపై దాడులు పెరిగిపోయాయని, ఎక్కడా న్యాయం జరగలేదని మైనారిటీ హక్కులు, పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కడప జిల్లాలోని మైదుకూరులో అక్బర్ బాషా వీడియో తనను కలచి వేసిందన్నారు. తాను కేవలం పరామర్శకి మాత్రమే వెళ్లానని చెప్పారు. ఆ వీడియోని డీజీపీ, జిల్లా ఎస్పీకి పంపానని తెలిపారు. నంద్యాల తరహా ఘటన జరగకూడదని కోరానని.. అయితే తనను చెన్నూరు టోల్ ప్లాజా వద్ద ఆపి, అరెస్టు చేశారన్నారు. తాను పోలీసులపై దాడి చేశానని కేసు పెట్టడం దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు. 


మైనారిటీ హక్కుల కోసమే తాను మొదటి నుంచి పని చేస్తున్నానని తెలిపారు. తనకు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పినా వినడం లేదన్నారు. సివిల్ పంచాయితీల్లో పోలీసులు జోక్యం చేసుకుని అహ్మద్‌ని ఇబ్బందులు పెట్టారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై ప్రశ్నిస్తే.. పార్టీ ముద్ర వేసి తప్పుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా.. తాము స్పందింస్తామని చెప్పారు. నిందితులను శిక్షించకపోవడం వల్లే దాడులు పెరిగిపోతున్నాయని తెలిపారు. ఏపీలో మైనారిటీలకు ఎక్కడ అన్యాయం జరిగినా.. తమ పరిరక్షణ సమితి అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2021-09-17T19:28:47+05:30 IST