Jul 23 2021 @ 05:07AM

దేవి సంగీత సారథ్యంలో...

శర్వానంద్‌, రష్మిక మందన్న జంటగా తిరుమల కిశోర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనున్నట్టు చిత్రబృందం గురువారం ప్రకటించింది. ‘మా సినిమాకు దేవి శ్రీ ప్రసాద్‌ అందించే సంగీతం ప్రధాన బలంగా నిలుస్తుంది’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ఇటీవలె ప్రారంభమైంది. ప్రస్తుతం హీరో, హీరోయిన్లపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ‘వెన్నెల’ కిషోర్‌, ఝాన్సీ, ప్రదీప్‌రావత్‌ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఛాయాగ్రహణం: సుజిత్‌ సారంగ్‌