జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు

ABN , First Publish Date - 2022-07-02T05:05:51+05:30 IST

రాష్ట్రంలో ప్ర జలు సంతోషంగా బతకాలన్నా, ధరలు తగ్గాలన్నా జగన్‌రెడ్డి దిగిపోవాలని తెలుగుదేశం పార్టీ నా యకులు డిమాండ్‌ చేశారు. జగన్‌ పాలనలో బా దుడే..బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం 21వ డివిజన్‌లో నిర్వహించారు.

జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు
నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, కార్యకర్తలు

టీడీపీ నాయకుల విమర్శ


ఒంగోలు(కార్పొరేషన్‌), జూలై 1: రాష్ట్రంలో ప్ర జలు సంతోషంగా బతకాలన్నా, ధరలు తగ్గాలన్నా జగన్‌రెడ్డి దిగిపోవాలని తెలుగుదేశం పార్టీ నా యకులు డిమాండ్‌ చేశారు. జగన్‌ పాలనలో బా దుడే..బాదుడు కార్యక్రమాన్ని టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవారం 21వ డివిజన్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హౌసింగ్‌ బోర్డు కాలనీలోని దామచర్ల సక్కుబాయమ్మ పాలిటెక్నిక్‌ కాలేజి వద్ద నుంచి హౌసింగ్‌ బోర్డు కాలనీల్లో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ ర్గాల ప్రజలకు కష్టాలు తప్పడం లేదన్నారు. అన్ని టిపైనా జేట్యాక్స్‌ విధిస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరల నుంచి ఆర్టీసీ ఛార్జీల వరకు బాదుడే బాదుడు కార్యక్రమాన్ని పెట్టుకు న్నారని విమర్శించారు. ఎన్నికలకు ముందు పా దయత్రలో ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ బ తిమాలి, అధికారంలోకి వచ్చిన నిత్యావసర ధరలు పెంచేయడంతోపాటు, గ్యాస్‌ ధరలు, పెట్రోలు, డీ జిల్‌, ఇంటి పన్నులు, చెత్తపన్నులు, కరెంటు ఛార్జీ లు పెంచేశారని మండిపడ్డారు. ఈ ఏడాది ఆరు నెలల్లో రెండుసార్లు ఆర్టీసి ఛార్జీలు పెంచి ప్రజల నెత్తిన ఆర్థికభారాన్ని మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు జాబ్‌ క్యాలెండర్‌ లేకుండా చేయడంతోపాటు సామాన్యులు ఇల్లు కట్టుకోవాల ంటే ఇసుక కోసం వేల రూపాయాలు ఖర్చు చే యాల్సి వస్తుందన్నారు. ఒంగోలు నగరంలో ప్రజ లు తాగునీటి అకోసం అల్లాడుతుంటే పట్టించుకో ని వైసీపీ పాలకులు మునిసిపల్‌ ఆస్తులను లా క్కునే పనిలో ఉన్నారని ఆరోపించారు. ప్రజలు తి రుగుబాటు చేయాల్సిన సమయం వచ్చిందని వా రు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు ఆ నందంగా ఉంటారన్నారు. ఇంటింటికీ తిరిగి కరప త్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగర అధ్యక్షుడు కొఠారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ కామేపల్లి శ్రీనివాసరావు, నాయకులు అ ప్పాజి, తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆర్ల వెంకటరత్నం, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కు సుమకుమారి, కార్యనిర్వాహకకార్యదర్శి నాళం నర సమ్మ, ఒంగోలు పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురా లు రావుల పద్మజ, ప్రధానకార్యదర్శి బీరం అరుణ,నగర అధ్యక్షురాలు వెంకటరత్నం పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-02T05:05:51+05:30 IST