ఆంధ్రజ్యోతి(13-11-2020)
ప్రశ్న: నేను పదో తరగతి చదువుతున్నాను. నా కళ్ల చుట్టూ నల్లటి వలయాలున్నాయి. ఆన్‌లైన్ క్లాసుల వల్ల సమస్య మరింత ఎక్కువైంది. తరుణోపాయం ఏమిటి?
- అరుణ్ కుమార్, హైదరాబాద్
డాక్టర్ సమాధానం: ఇంత చిన్న వయసులో వలయాలు ఏర్పడడానికి అనేక కారణాలు ఉండవచ్చు. వంశపారంపర్య సమస్య కావచ్చు. రక్తహీనత వల్ల రావచ్చు. అధిక అలసట, అలర్జీల వల్లా కళ్ల చుట్టూ వలయాలు ఏర్పడతాయి. మీ విషయంలో కారణమేమిటో తెలుసుకోవాలి. ఒకవేళ రక్తహీనతే అయితే ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడండి. మీరు మాంసాహారులైతే వారానికి రెండు సార్లు నాన్‌వెజ్ తీసుకోండి. శాకాహారులైతే ఏదో ఓ రూపంలో ఆకుకూరలు తీసుకోవాలి. పాలు, పళ్లతో పాటు బాదం, ఆక్రోట్ లాంటి గింజలు తింటే అవసరమైన అన్ని పోషకాలూ అందుతాయి. సమయానికి భోజనం, నిద్ర ఉంటే అలసట వల్ల వచ్చే నల్ల వలయాలు తగ్గుతాయి. ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అవుతున్నా సరే మధ్య మధ్యలో పది నిమిషాలకోసారి కళ్లకు అరనిమిషం పాటు ఉపశమనం ఇవ్వడం మంచిది.
డా. లహరి సూరపనేని
న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్
nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను
[email protected] కు పంపవచ్చు)