అండర్‌-17 మహిళల సాకర్‌ వరల్డ్‌కప్‌ వాయిదా

ABN , First Publish Date - 2020-04-05T09:45:17+05:30 IST

కరోనా వైరస్‌ దెబ్బకు తాజాగా మరో మెగా టోర్నమెంట్‌ వాయుదా పడింది. వచ్చే నవంబరులో భారత్‌ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఫిఫా అండర్‌-17 మహిళల వరల్డ్‌క్‌పను ...

అండర్‌-17 మహిళల సాకర్‌ వరల్డ్‌కప్‌ వాయిదా

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ దెబ్బకు తాజాగా మరో మెగా టోర్నమెంట్‌ వాయుదా పడింది. వచ్చే నవంబరులో భారత్‌ ఆతిథ్యం ఇవ్వాల్సిన ఫిఫా అండర్‌-17 మహిళల వరల్డ్‌క్‌పను వాయిదా వేస్తున్నట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ సమాఖ్య (ఫిఫా) శనివారం ప్రకటించింది. నవంబరు రెండు నుంచి 21 వరకు దేశంలోని ఐదు ప్రాంతాలు.. కోల్‌కతా, గువాహటి, భువనేశ్వర్‌, అహ్మదాబాద్‌, నవీ ముంబైలో ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉంది. భారత్‌ సహా మొత్తం 16 జట్లు ఈ ప్రపంచ కప్‌లో తలపడాల్సి ఉంది. ఈ టోర్నమెంట్‌తో పాటు ఆగస్టులో పనామా/కోస్టారికాలో నిర్వహించాల్సిన అండర్‌-20 మహిళల వరల్డ్‌క్‌పనూ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు టోర్నమెంట్లు ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటిస్తామని ఫిఫా పేర్కొంది. 

Updated Date - 2020-04-05T09:45:17+05:30 IST