విద్యార్థుల్లో దాగిన కళలను వెలికితీయాలి

ABN , First Publish Date - 2021-09-19T04:05:32+05:30 IST

విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను, నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు.

విద్యార్థుల్లో దాగిన కళలను వెలికితీయాలి
పుస్తకాలను ఆవిష్కరిస్తున్న రోజాశర్మ, రఘోత్తంరెడ్డి

  జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి

 సికింద్లాపూర్‌లో విద్యార్థులు రాసిన పుస్తకాల ఆవిష్కరణ


చిన్నకోడూరు, సెప్టెంబరు 18: విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను, నైపుణ్యాలను వెలికితీయడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. మండలంలోని సికింద్లాపూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాలసి సికింద్లాపూర్‌ సిరిమువ్వలు (కథలు), సికింద్లాపూర్‌ సౌరభాలు (వచన కవితలు)పుస్తకాలను శనివారం వారు ఆవిష్కరించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం ప్రభుత్వం రూ.4 వేల కోట్లను బడ్జెట్‌లో విడుదల చేసిందన్నారు. పాఠశాలల్లో సమస్యలపై తమ దృష్టికి తీసుకువస్తే మంత్రి హరీశ్‌రావు సహకారంతో పరిష్కరిస్తామని చెప్పారు. అనంతరం సర్పంచ్‌ జయవర్ధన్‌రెడ్డి రెండు వాటర్‌ డిస్పెన్సర్‌లను బహుకరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, సర్పంచ్‌  జయవర్ధన్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ సింగారయ్య, ఎంపీటీసీ బాలయ్య, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్‌ వెంకటేశం, ఎంఈవో దేశిరెడ్డి, ఎస్‌ఏంసీ చైర్మన్‌ అశోక్‌, కవులు వెంకటేశ్వర్లు, రాజమౌళి, లక్ష్మయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల్‌లింగం, పుస్తక సంపాదకులు మాధవిలత, పీఆర్‌టీయూ మండలాధ్యక్షుడు వెంకట్‌రాజం, నాయకులు మధుసూధన్‌రెడ్డి, స్వామి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. రామంచ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు చక్రపాణి ఆగ్రో ఇండస్ట్రీస్‌, విజయ్‌కుమార్‌రావు సహకారంతో నోట్‌బుక్స్‌, స్టేషనరీని చైర్‌పర్సన్‌ రోజాశర్మ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఏంఈవో దేశిరెడ్డి, హెచ్‌ఎం అబ్ధుల్‌షరీఫ్‌, సర్పంచ్‌ సంతోషి, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, కాంప్లెంక్స్‌ హెచ్‌ఎం శ్రీనివాస్‌, ఎస్‌ఏంసీ వైస్‌ చైర్మన్‌ భారతి పాల్గొన్నారు.


 

Updated Date - 2021-09-19T04:05:32+05:30 IST