ఉక్కు పరిరక్షణకు రాజీలేని పోరాటాలు

ABN , First Publish Date - 2022-05-19T06:07:43+05:30 IST

ఉక్కు పరిరక్షణకు రాజీ లేని పోరాటాలు చేస్తామని పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన దీక్షలు బుధవారం 461వ రోజు కొనసాగాయి.

ఉక్కు పరిరక్షణకు రాజీలేని పోరాటాలు
రిలే నిరాహార దీక్షల శిబిరంలో మాట్లాడుతున్న వరసాల శ్రీనివాసరావు

పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు

కూర్మన్నపాలెం, మే 18: ఉక్కు పరిరక్షణకు రాజీ లేని పోరాటాలు చేస్తామని పరిరక్షణ పోరాట కమిటీ నాయకుడు వరసాల శ్రీనివాసరావు అన్నారు. కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఉక్కు ఉద్యోగులు చేపట్టిన దీక్షలు బుధవారం 461వ రోజు కొనసాగాయి. ఈ శిబిరంలో వరసాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడలో భాగంగా స్థానిక యాజమాన్యం అనేక విభాగాల్లో ఉత్పత్తిని నిలిపివేస్తూ కార్మికుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నదని ఆరోపించారు. పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ కార్మికులు మరింతగా ఉమ్మడి పోరాటాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.   


Updated Date - 2022-05-19T06:07:43+05:30 IST