మురికి నీటిలోనే..

ABN , First Publish Date - 2020-11-23T05:59:18+05:30 IST

తుంగభద్ర నదిలో తగినంత నీటి ప్రవాహం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

మురికి నీటిలోనే..

కర్నూలు(న్యూసిటీ/అగ్రికల్చర్‌), నవంబరు 22: తుంగభద్ర నదిలో తగినంత నీటి ప్రవాహం లేకపోవడంతో భక్తులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా నగరేశ్వర, రాఘవేంద్రమఠం, రాంబొట్ల దేవాయలయం వద్ద ఘాట్లలో ఈ పరిస్థితి ఉంది. నదిలో మునిగేందుకు కరోనా నిబంధనలు ఉన్నాయని చెబుతున్న అధికారులు.. కనీసం పిండప్రదానానికి అవసరమైన నీటిని కూడా నిల్వ చేయడంలో విఫలమయ్యారు. పెద్దలకు పిండ ప్రదానాలు చేశాక నదిలో తర్పణం చేస్తారు. ప్రస్తుతం నదిలో నీరు లేక మురికినీటిలో పారవేయాల్సి వస్తోంది. 


పెద్దల ఆత్మ శాంతించదు: శ్రీనివాస్‌, కర్నూలు

పుష్కరాలలో మరణించిన వారికి పిండప్రదానం చేస్తే వారి ఆత్మ శాంతిస్తుందని శాస్త్రం చెబుతోంది. ఇక్కడ ఘాట్‌లో పిండాలను వదిలేందుకు నీరు లేకపోవడం బాధాకరం. చివరికి నిల్వ ఉన్న మురికి నీటిలో వదలాల్సిన దుస్థితి. ఇలా అయితే పెద్దల ఆత్మ శాంతించదు. 

Updated Date - 2020-11-23T05:59:18+05:30 IST