కోటకాడపల్లెలో తెగని పంచాయితీ!

ABN , First Publish Date - 2022-01-22T07:05:18+05:30 IST

కోటకాడపల్లె పంచాయతీ పరిధిలో సంఘమిత్ర చేతివాటంతో డ్వాక్రా సంఘాలకు చెందిన సొమ్ము రూ.లక్షల్లో గల్లంతైంది.

కోటకాడపల్లెలో తెగని పంచాయితీ!

రూ.18లక్షలు సంఘమిత్ర స్వాహా చేశారంటూ సభ్యుల ఆరోపణ

కొనసాగుతూనే ఉన్న బుజ్జగింపులు


ఎర్రావారిపాళెం, జనవరి 21: ఎర్రావారిపాళెం మండలం కోటకాడపల్లె పంచాయతీ పరిధిలో సంఘమిత్ర చేతివాటంతో డ్వాక్రా సంఘాలకు చెందిన సొమ్ము రూ.లక్షల్లో గల్లంతైంది. దీన్ని సంఘ సభ్యులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ బ్యాంకు ఖాతాల్లో నగదు చేయమని ఇస్తే.. సంఘమిత్ర జమ చేయకపోవడంతోపాటు తమ పేరిట బ్యాంకు నుంచి రుణాలు కూడా తీసుకుని.. మొత్తం రూ.18లక్షల వరకు దోచేసినట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనివెనుక కొందరు బ్యాంకు సిబ్బంది సహకారం ఉన్నట్లు వారు చెబుతున్నారు. దీనిపై బ్యాంకు అధికారులు, వెలుగు ఏపీఎం, సీసీలు సంఘ సభ్యులతో మాట్లాడుతున్నారు. స్వాహా చేసిన సొమ్మును తిరిగి జమ చేస్తామని బుజ్జగిస్తున్నారు.  వచ్చేనెల రెండో తేదీలోపు తమ సొమ్ము జమకాకుంటే కేసు పెడతామని సభ్యులు హెచ్చరించారు.

Updated Date - 2022-01-22T07:05:18+05:30 IST