Shahrukh khan ఇల్లు రాజసౌధమే.. 20 ఏళ్ల క్రితం రూ.13 కోట్లకు కొన్న ఆ బంగ్లా ఖరీదు ఇప్పుడు ఎన్ని వందల కోట్లంటే..

కింగ్ ఖాన్ షారుఖ్ ఇల్లు ‘మన్నత్’. ముంబైలో ఇది దశాబ్దాలుగా ఓ ల్యాండ్‌మార్క్. రోజూ వందలాది మంది అభిమానులు గుమికూడే టూరిజం స్పాట్! తమ బాద్షాని ఓ సారి చూసుకుందామని దేశంలోని పలు ప్రాంతాల నుంచీ అక్కడికి ఫ్యాన్స్ వస్తుంటారు!

‘మన్నత్’ ఇంత కాలం మంచి కారణాలతో న్యూస్‌లో ఉండగా ఇప్పుడు నెగటివ్ రీజన్స్‌తో వార్తల్లో నిలుస్తోంది. ‘మన్నత్’ రాజసౌధానికి బాద్షా మహారాజైతే, యువరాజు ఆర్యన్ ఖాన్. అతను అరెస్ట్ అయిన క్షణం నుంచీ మీడయా ఫోకస్ అంతా ‘మన్నత్‘ వైపే ఉంటోంది. ఎస్ఆర్కే ఇంట్లో ఏం జరుగుతోందంటూ కెమెరాలు అదే పనిగా చూపు సారించాయి. ఇక లెటెస్ట్‌గా ఎన్సీబీ అధికారులు రైడ్ నిర్వహించటంతో మరింత సెన్సేషన్ అయిపోయింది ‘ఖాన్’దాన్ నివాసముండే ‘మన్నత్’!

షారుఖ్ ఖాన్ లాగే అతడి ఇల్లు కూడా బోలెడు ఫేమస్. ముంబైలోనే కాదు మొత్తం ఇండియాలోనూ అది ఫేమస్ ల్యాండ్ మార్క్. అందుకు కారణం దాని విశేషాలే. ఒకప్పుడు 13 కోట్లు విలువ చేసిన ఆ ఆరు అంతస్థుల భవనం ఇప్పుడు 350 కోట్లకు తక్కువ కాకుండా ధర పలుకుతోంది! బాద్షా మహాప్రాసదంలో అణువణువు ఆశ్చర్యమేనంటారు! కిటికీలు, గోడలు, ఫర్నీచర్, ఫ్లోరింగ్, రూఫింగ్... ఇలా అన్ని వేపులా కోట్లు ఖరీదు చేసే అలంకారాలే!

షారుఖ్ ఖాన్ ఇల్లు మొదట ఓ గుజరాతీ పార్సీ వ్యక్తిది. అప్పట్లో ఈ ఇంటి పేరు ‘విల్లా వియన్నా’. దాన్ని ఎస్ఆర్కే 13.32 కోట్లకు 2001లో కొన్నాడట. తరువాత క్రమంగా రేటు పెరుగుతూ వచ్చింది. ఇఫ్పుడు ‘మన్నత్’ మార్కెట్ విలువ 350 కోట్లకు పైగా ఉంటుందని అంచన. 

తాను కొన్నప్పుడు ‘విల్లా వియన్నా’గా ఉన్న పేరుని ‘జన్నత్’గా మార్చాలని భావించాడట షారుఖ్. కానీ, అనేక తర్జనభర్జనల తరువాత ‘మన్నత్’ అనే టైటిల్ ఫిక్స్ అయింది కింగ్ ఖాన్ ఇంటికి. 

బాలీవుడ్ బాద్షా తన బేగం కోసం ప్రత్యేకంగా ఈ ఇంటిని కొన్నాడంటారు. స్వయంగా ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌరీ ఖాన్ తన  అభిరుచికి అనుగుణంగా ‘మన్నత్’ని ముస్తాబు చేసుకున్నారు. అందుకోసం కింగ్ ఖాన్ దంపతులు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట. 

మొత్తం ఆరు అంతస్థుల భవనంగా ముంబై సముద్ర తీరంలో నిలువెత్తున నిలిచే ఎస్ఆర్కే ఇంట్లో... కేవలం రెండు అంతస్థులు మాత్రమే బాద్షా ఫ్యామిలీ వాడుకుంటుంది. మిగతా నాలుగు ఫ్లోర్స్‌లో ఆఫీసులు, ప్రైవేట్ బార్స్, ప్రైవేట్ థియేటర్స్, స్మిమ్మింగ్ పూల్స్, గెస్ట్ రూమ్స్, జిమ్స్, లైబ్రెరీస్, ప్లే ఏరియాస్, పార్కింగ్ ఏరియాస్ వంటివి ఉంటాయి... 

‘మన్నత్’లో మొత్తం ఐదు లగ్జరీ బెడ్రూమ్స్ ఉంటాయని టాక్. అంతే కాదు, పలు లివింగ్ ఏరియాస్, డైనింగ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయట. 

షారుఖ్ ఖాన్ సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటి వరకూ ఎన్నో అవార్డ్స్ సంపాదించాడు. వాటి కోసం కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంది ‘మన్నత్’లో. అక్కడ ఖాన్ ఖాతాలో పడిన ప్రతీ పురస్కారం మనకు దర్శనం ఇస్తుంది. 


లాస్ట్ బట్ నాట్ లీస్ట్... షారుఖ్ ఖాన్ ఇంట్లోని ప్రతీ ఫ్లోర్‌కు సీ సైడ్ వ్యూ ఉంటుంది. ఎక్కడ బాల్కనీలోకి వచ్చిన ఎదురుగా అందమైన సముద్రం ఉవ్వెత్తున ఎగుస్తూ మురిపిస్తుంది! 

Advertisement

Bollywoodమరిన్ని...