Abn logo
Sep 16 2021 @ 23:51PM

అనఽధికార మైనింగ్‌, పేలుడు ఘటనలో ముగ్గురు అరెస్టు

అరెస్టు చేసిన నిందితులను చూపుతున్న సీఐ, ఎస్‌ఐలు

వేముల, సెప్టెంబరు 16: మం డలంలోని కుప్పగుట్టపల్లె గ్రామ గుట్టలో సెప్టెంబరు 6వ తేదీ  జరిపిన అనధికార మైనింగ్‌, భారీ బ్లాస్టింగ్‌ ఘటనలో ముగ్గు   రిని అరెస్టు చేసినట్లు పులివెందు ల రూరల్‌ సీఐ రవీంద్రనాథ్‌ రెడ్డి, ఎస్‌ఐ సంజీవరెడ్డి తెలిపా రు. గురువారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేక రుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ సెప్టెంబరు 6న ఎటువంటి అనుమతులు లేకుండా కంకర మిషన్‌లోకి రాళ్ల కోసం భారీస్థాయిలో పేలుడు పదార్థాలను ఉప యోగించి గుట్టలో పేలుడు జరిపారన్నారు. తహసీల్దార్‌ నరసింహులు సెప్టెంబరు 7న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేశామన్నారు. వేల్పుల గ్రామానికి చెందిన యర్రంరెడ్డి రామాంజులరెడ్డి, వీరపునాయునిపల్లె మండలం ఓబాయపల్లె గ్రామానికి చెందిన పోతుల గౌతమ్‌లు ఈఅక్రమ బ్లాస్టింగ్‌ పాల్పడి నట్లు తెలిపారు. అలాగే అనంతపురం జిల్లా నార్పల మండలం తుంపెర గ్రామానికి చెందిన వల్లెపు రాజకుళాయప్ప పేలుడు పదార్థాలను సరఫరా చేశారన్నారు. వీరి ముగ్గురిని గురువారం బెస్తవారిపల్లె క్రాస్‌ వద్ద అరెస్టు చేసి, పేలుడు పదార్థాలు సరఫరా చేసిన బొలెరో పికప్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.