సూరత్ (గుజరాత్): కరోనా సంక్షోభ సమయంలో పని ఒత్తిడి తట్టుకోలేక ఓ ఇంజినీరు తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ నగరంలో వెలుగుచూసింది. సూరత్ నగరానికి చెందిన జిగార్ గాంధీ నోయిడాకు చెందిన ఓ సంస్థలో ఎలక్ట్రికల్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల ఇంటికి తిరిగివచ్చిన జిగార్ వర్కు ఫ్రం హోం చేస్తూ పని ఒత్తిడిని తట్టుకోలేక మెట్ల రెయిలింగు వద్ద ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు జిగార్ గాంధీకి డిసెంబరులో నిశ్చితార్థం తేదీ నిర్ణయించామని, ఈలోగా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు చెప్పారు.