నా కొడుకును కాపాడుకోలేకపోతున్నాను....

ABN , First Publish Date - 2021-11-20T22:48:28+05:30 IST

నాకు రెండు సార్లు గర్భస్రావం జరిగిన తర్వాత.... ఇక తల్లినయ్యే భాగ్యం నాకు దక్కుతుందని కలలో కూడా అనుకోలేదు.

నా కొడుకును కాపాడుకోలేకపోతున్నాను....

నాకు రెండు సార్లు గర్భస్రావం జరిగిన తర్వాత.... ఇక తల్లినయ్యే భాగ్యం నాకు దక్కుతుందని కలలో కూడా అనుకోలేదు. అయినప్పటికీ, అమ్మానాన్నలం కావాలన్న ఆశతో... చివరిగా మరో ప్రయత్నం చేద్దామని నేను, నా భర్త ప్రశాంత్ నిర్ణయించుకున్నాం. నేను గర్భవతినయ్యాననే వార్త నా చెవిన పడగానే అంతులేని ఆనందం కలిగింది. సంతోషం పట్టలేకపోయాను. కానీ, నాకు పుట్టిన బాబు ఇంత త్వరగా ఇబ్బందుల పాలవుతాడని ఊహించనే లేదు.... అంటూ తట్టుకోలేని తన ఆవేదనను ఆ తల్లి రమ్య వ్యక్తం చేసింది.


గత నెల అక్టోబర్ 8వ తేదీన రమ్య కవల మగశిశువులకు జన్మనిచ్చింది. నెలలు నిండక ముందే.... అంటే, గర్భం దాల్చిన 6 నెలలకే పుట్టడంతో ఆ పిల్లలు అత్యంత బలహీనంగా ఉన్నారు. అయితే, పిల్లల్లో 2వ బాబు కిలో కంటే తక్కువ బరువుతో జన్మించాడు. ఈ అబ్బాయి మరింత బలహీనంగా ఉన్నందువల్ల మొదటి పిల్లవాడితో పోల్చితే మరింత ప్రాణాపాయకరమైన స్థితిలో ఉన్నాడు. ఈ రెండవ అబ్బాయి viral pneumoniaకు గురై తన శ్వాసకోశ పైభాగం ( upper lobe)లో ఇబ్బంది ఏర్పడింది.


ఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ పసివాడికి సాయం చెయ్యండి...


అబ్బాయిని పరిశీలనలో ఉంచాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. వాడి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. అత్యవసర చికిత్స చేసిన తర్వాత పరిస్థితి మెరుగయ్యే అవకాశాలున్నాయని నర్సులు డాక్టర్ల మాటగా చెప్పారు. ఈ బాబుకి చికిత్స చెయ్యడానికి రూ.25 లక్షల ($ 33840.25) భారీ మొత్తం ఖర్చవుతుందని అంచనా వేశారు. రమ్య, ప్రశాంత్‌లు ఎంతో కలవరపాటుకు లోనయ్యారు. ప్రశాంత్ కార్మికుడిగా పనిచేస్తుంటే... రమ్య సాధారణ ఇల్లాలిగా ఆ ఇంటిని నడుపుతోంది. ఆర్థికంగా వీరి పరిస్థితి గమనిస్తే... తమ పిల్లవాడి చికిత్సకయ్యే ఖర్చును భరించేంత స్తోమత వారికి ఎంతమాత్రం లేదు.


"నా ముద్దుల బాబును ఎత్తుకుని ఆడుకోవాలని ఉంది. పిల్లలంటే నాకెంతో ఇష్టం. వీడి పరిస్థితి చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతోంది. అందుకే ఖర్చులు భరించడానికి వెంటనే నగలు అమ్మేశాను" అంటూ రమ్య రోదించింది. ఆర్థిక పరిస్థితి ఇంతగా వేధిస్తున్నా... రమ్య ఎలాగోలా తన కొడుక్కి చికిత్స అందేలా శత విధాలా ప్రయత్నిస్తోంది. తన కొడుకు కోసం అక్కడే ఉండిపోయింది. ఆ చిన్నారిని ఆలాగే చూస్తూ తన వల్ల చెయ్యగలిగిందంతా చేస్తోంది. "మేం పూర్తిగా నాకొచ్చే కొద్దిపాటి జీతం పైనే ఆధారపడి ఉన్నాం. కొన్నిసార్లు ఆ జీతం కూడా సరిపోదు. దేవుడి దయ మీదే ఆశపెట్టుకున్నాను..." అంటూ సాయం కోసం తను ఎంతగా పరితపిస్తున్నాడో తెలియజేశాడు.


ఈ లింక్‌పై క్లిక్ చేసి ఈ పసివాడికి సాయం చెయ్యండి...


దినసరి కూలీగా పనిచేస్తున్న ప్రశాంత్‌కి నెల జీతం కేవలం రూ.10 వేలు మాత్రమే... "మా బాబు ఏడుపు వింటున్నప్పుడల్లా మా గుండె ముక్కలైపోతోంది. సాయం కోసం అర్థిస్తున్నాం..." ఆ తల్లిదండ్రులు చెప్పగలుగుతోంది ఇంతే... ఈ నిరుపేద తల్లిదండ్రుల వద్ద ఇక మిగిలిందేమీ లేదు. తమ చిన్నారికి చికిత్స కోసం ఉన్నదంతా ఖర్చుపెట్టారు. కన్నీరు తప్ప మరేం లేదు. మీ సహాయం కోసం రమ్య, ప్రశాంత్ పరి పరి విధాలుగా విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్ద మనస్సుతో మీరందించే ఆర్థిక సాయం మాత్రమే వారి పిల్లవాడిని రక్షించగలదు. దయచేసి స్పందించండి.

Updated Date - 2021-11-20T22:48:28+05:30 IST