తగ్గని ప్రాణహిత ఉధృతి

ABN , First Publish Date - 2022-08-12T04:53:51+05:30 IST

మండలసరిహద్దుల్లో ప్రవహి స్తున్న ప్రాణహితనది వరద ఉధృతి తగ్గకపోవడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత బ్యాక్‌వాటర్‌ కారణంగా తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తలాయి, పాతసోమిని గ్రామాల మధ్య నిర్మించిన వంతెన పూర్తిగా వరదనీటిలో మునిగి ఉంది. దీంతో ఆయాగ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

తగ్గని ప్రాణహిత ఉధృతి
దహెగాం మండలం మొట్లగూడలో పంట చేలలో చెరువును తలపిస్తున్న నీరు

బెజ్జూరు, ఆగస్టు 11: మండలసరిహద్దుల్లో ప్రవహి స్తున్న ప్రాణహితనది వరద ఉధృతి తగ్గకపోవడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత బ్యాక్‌వాటర్‌ కారణంగా తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. తలాయి, పాతసోమిని గ్రామాల మధ్య నిర్మించిన వంతెన పూర్తిగా వరదనీటిలో మునిగి ఉంది. దీంతో ఆయాగ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. బ్యాక్‌ వాటర్‌తో ఇప్పటికే పలుమార్లు వందఎకరాల్లో పత్తిపంట నీటమునిగి రైతులు అన్నివిధాల నష్టపోయారు.

సిర్పూర్‌(టి): మండలంలోని టోంకిని, పారిగాం సమీపంలో ఒర్రెపై పెన్‌గంగా బ్యాక్‌వాటర్‌ తగ్గలేదు. దీంతో గురువారం సైతం సిర్పూర్‌(టి)-కౌటాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

దహెగాం: మండలంలోని మొట్లగూడ, రాంపూర్‌ గ్రామాల్లో పత్తి, వరితదితరపంటలు మూడు రోజు లుగా ప్రాణహిత నది బ్యాక్‌వాటర్‌లో నీటముని గాయి. గురువారం సైతం వరదఉధృతి తగ్గక పోవ డంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

Updated Date - 2022-08-12T04:53:51+05:30 IST