కల్లాల్లో కన్నీళ్లు

ABN , First Publish Date - 2021-04-16T06:19:22+05:30 IST

యాసంగి సీజన్‌లో పంటలు చేతికొచ్చే దశలో కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో, మార్కెట్‌యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోతోంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు, మామిడితోటలు దెబ్బతింటున్నాయి. పగలంతా ఎండగా ఉంటున్న వాతావరణం సాయంత్రానికి మారిపోతోంది. గాలిదుమ్ము, వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలిదుమారం తీవ్రతకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన గాలివానకు వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరి, మొక్కజొన్న, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.

కల్లాల్లో కన్నీళ్లు
ఈదురుగాలుల ధాటికి నేలవాలిన వరి

పంట చేతికొచ్చే వేళ ఈదురుగాలులు, వర్షం

నేలవాలిన వరి, తడిసిన మిరపకాయలు

కాపాడుకునేందుకు రైతుల తంటాలు 

గాలిదుమారం ధాటికి రాలిన మామిడి కాయలు

నెట్‌వర్క్‌:యాసంగి సీజన్‌లో పంటలు చేతికొచ్చే దశలో కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్లాల్లో, మార్కెట్‌యార్డుల్లో ఆరబెట్టిన ధాన్యం తడిచిపోతోంది. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు, మామిడితోటలు దెబ్బతింటున్నాయి. పగలంతా ఎండగా ఉంటున్న వాతావరణం సాయంత్రానికి మారిపోతోంది. గాలిదుమ్ము, వాన బీభత్సం సృష్టిస్తున్నాయి. గాలిదుమారం తీవ్రతకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన గాలివానకు వందలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వరి, మొక్కజొన్న, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. చేతికి అందివస్తుందనుకున్న పంట వర్షానికి పాడవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. చంద్రుగొండ మండలంలో గురువారం ఉదయం నుంచి చిరుజల్లులతో కూడిన వాన మండలంలో కురిసింది. దీంతో కల్లాల్లో ఆర బోసిన ధాన్యం, మిరపకాయలు తడవకుండా కాపా డుకు నేందుకు రైతులు పరుగులు తీశారు. గాలి తాకిడికి కోతకు వచ్చిన వరి నేలమట్టమైంది. వరి కోతలు ప్రారంభమైన ప్ర స్తుత పరిస్థితుల్లో వానలు కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మామిడి తోటల్లో మామిడి కాయలు గాలి, వానకు రాలిపోయాయి.. 

అశ్వాపురం మండలంలో గురువారం తెల్లవారు జా మున భారీవర్షం కురిసింది. రెండుగంటల పాటు కురిసిన వర్షానికి రహదారులు జలమయం కాగా వాగులు, వంకలు పొంగాయి. అకాల వర్షం కారణంగా మిర్చి,వరిపంటలకు స్వల్పంగా నష్టం వాటిల్లింది. మల్లెలమడుగు ఎస్సీ కాలనీలోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. అన్నదాతలో ఆందోళనః మండలంలో రెండు రోజులుగా చిరుజల్లులతో పాటు గురువారం భారీ వర్షం కురియటంతో అన్నదాతల్లో ఆందోళన అలుముకుంది. ముఖ్యంగా తుమ్మలచెరువు ఆయకట్టు రైతులు అకాల వర్షాలతో బెంబేలెత్తుతున్నారు. ఆయకట్టు పరిధిలో యాసంగి సీజన్‌కు గానూ సుమారు 4వేల ఎ కరాల్లో రైతులు వరిసాగు చేశారు. ప్రస్తుతం వరి పొట్ట,కోత దశలో ఉంది.ఈతరుణంలో అకాల వర్షాలు పడుతుండటంతో పంట నేలరాలి దిగుబడి తగ్గుతుందని రైతులు వాపోతున్నారు. మరోపదిరోజుల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉంది.

బూర్గంపాడు మండల పరిధిలో 5.8 మిమీ వర్షపాతం నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు. బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్‌ యార్డుతో పాటు గ్రామాలలో ఏర్పా టు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకు రైతులు తరలించిన ధాన్యం పలు చోట్ల తడిచి పోయాయి. మండల పరిధిలో సుమారు 150క్వింటాళ్ల ధాన్యం వర్షానికి తడిచినట్లు మండల వ్యవసాయశాఖ అధికారి అనిల్‌కుమార్‌ పేర్కొన్నారు. కోతకు వచ్చిన పంట పోలాలు సైతం వర్షానికి నేలమట్టమయ్యాయి. మండల పరిధిలో 15రోజుల క్రితం వరికోతలను ప్రారంభించిన రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ధాన్యాన్ని కేంద్రాల వద్ద కుప్పలు గా పోసి ఉంచారు. దీంతో అకాల వర్షానికి తడిపోవడంతో పాటు కొట్టుకుపోయాయి. ఇకనైనా సంబంధిత అధికారు లు స్పందించి కొనుగోలు కేంద్రాలను ప్రారంబించి ధాన్యా న్ని కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

 అశ్వారావుపేటలో బుధవారం అర్థరాత్రి భారీ వర్షం పడింది. రాత్రి రెండు గంటలు తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, గాలులతో కూడిన వర్షం పడింది. దాదాపు రెండు గంటల పాటు భారీ వర్షం పడింది. అశ్వారావుపేటలో 34.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. అశ్వారావుపేటలో గురువారం ఉదయం కూడా చిరు జల్లులు పడ్డాయి. అశ్వారావుపేటతో పాటు పరిసర గ్రామాల్లోనూ ఒక మాదిరి వర్షం పడగా గుమ్మడివల్లి, నారాయణపురం, అనంతారం ప్రాంతాల్లో గాలులు వీచాయి. 

చర్ల మండలంలో గురువారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. సుమారు రెండు గంటల పాటు కురిసిన వర్షంతో కోతకు వచ్చిన వరి, కల్లాల్లో ఆరబోసిన మిర్చి  దెబ్బతిన్నాయి. మండల వ్యాప్తగా సుమారు రెండు కోట్ల నష్టం వాటిళ్ళింది. పంట చేతికందిన తరుణంలో వర్షం కురియడంతో రైతులు లబోదిబో అంటున్నారు. ఈ ఏడాది కూడా అప్పులు తప్పవని మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారు. వాతావరణంలో మార్పులు కారణంగా భారీ వర్షం పడింది. అనుకోకుండా వర్షం కురియడంతో మండలంలోని లింగాపురం, గొంపల్లి, మొగళ్ళపల్లి, వీరాపురం, సీకత్తిగూడెం, కొత్తపల్లి, కోరెగడ్డ తదితర ప్రాతాంల్లో సాగు చేసి ఆరబెట్టిన మిర్చి కాయలు తడిచి పోయాయి.  కల్లాల్లో నీరు చేరి కాయలు నీటిలో తేలియాడాయి. దీంతో చేసేది ఏమీలేక రైతులు కాయలను సేకరించి ఆరబెడుతున్నారు. తడిచిన మిర్చికాయలకు మార్కెట్‌ లో ధర ఉండదని చెబుతున్నారు. అలాగే అకాల వర్షం కారణంగా చర్ల, పెద్దమిడిసిలేరు, సత్యనారాయణ పురం, పెద్దిపల్లి తదితర గ్రామాల్లో యాసంగి సాగు దెబ్బతినింది. కంకులు నేలవాలాయి.  యంత్రాల ద్వారా కోసి ఆరబెట్టిన ఽవరి ధాన్యం తడిచింది. భారీ వర్షంతో పాత చర్ల లోని ఓ ఇల్లు పాక్షికంగా దెబ్బతినింది. మండలంలో జరిగిన పంట నష్టాన్ని చర్ల వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 

Updated Date - 2021-04-16T06:19:22+05:30 IST