అందులో విఫలమైతే..కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి: ఐక్యరాజ్యసమితి చీఫ్ హెచ్చరిక

ABN , First Publish Date - 2022-01-19T03:26:10+05:30 IST

ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ టీకా వేయడంలో విఫలమైతే కొత్త కరోనా వేరియంట్లు ఉనికిలోకి వస్తాయని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ యాంటోనియో గుటెర్రస్ సోమవారం హెచ్చరించారు.

అందులో విఫలమైతే..కొత్త వేరియంట్లు పుట్టుకొస్తాయి: ఐక్యరాజ్యసమితి చీఫ్ హెచ్చరిక

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ టీకా వేయడంలో విఫలమైతే కొత్త కరోనా వేరియంట్లు ఉనికిలోకి వస్తాయని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ యాంటోనియో గుటెర్రస్ సోమవారం హెచ్చరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం-2022 సమావేశాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. టీకాకరణను మరింత వేగవంతం చేయాలని, కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో లేని దేశాలకు వాటిని సరఫరా చేయాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు. 


‘‘ఒక్కరికి కరోనా టీకా అందకపోయినా..మనమందరం టీకా వేసుకోనట్టే.  గత రెండు సంవత్సరాల కాలం మనకు నేర్పిన పాఠం ఇదే..’’ అని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో వచ్చే వేరియంట్ల కారణంగా ప్రజాజీవనం, ఆర్థికవ్యవస్థలు ఒక్కసారిగా స్థంభించిపోగలవని గుటెర్రస్ హెచ్చరించారు. 

Updated Date - 2022-01-19T03:26:10+05:30 IST