Abn logo
Sep 25 2021 @ 03:32AM

రైజర్స్‌ జట్టులో ఉమ్రాన్‌

షార్జా: కరోనా పాజిటివ్‌గా తేలిన పేసర్‌ నటరాజన్‌ స్థానంలో సన్‌రైజర్స్‌ తమ నెట్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ను జట్టులోకి తీసుకుంది. నటరాజన్‌ కోలుకునే వరకు ఈ జమ్మూ కశ్మీర్‌ పేసర్‌ జట్టులో ఉంటాడని ఫ్రాంచైజీ ప్రకటించింది. బుధవారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌కు ముందే నటరాజన్‌ కొవిడ్‌ టెస్టులో పాజిటివ్‌గా తేలడంతో ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాడు.