Abn logo
Oct 2 2020 @ 02:56AM

‘హత్రాస్‌’ నిందితులను కఠినంగా శిక్షించాలి

కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెంకట్రావు


ఏలేశ్వరం, అక్టోబరు 1: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో 19ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి దారుణంగా హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, పీసీసీ సభ్యుడు ఉమ్మిడి వెంకట్రావు డిమాండ్‌ చేశారు. గురువారం ఏలేశ్వరంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ హత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీల పర్యటనను అడ్డుకుని అరెస్ట్‌ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్‌ను పోలీసులు కిందపడేసి లాఠీచార్జి చేసి అవమానించడం సమంజసం కాదని, ఈఘటనకు బాధ్యత వహించి సీఎం యోగి రాజీనామా చేయాలని, పోలీసులు క్షమాపణ చెప్పాలని వెంకట్రావు డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement
Advertisement