చర్లపల్లి జైల్‌కు మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ ఉమేష్ ఖతిక్‌

ABN , First Publish Date - 2022-04-17T02:08:53+05:30 IST

మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ ఉమేష్ ఖతిక్‌ ని హైదరాబాద్ పోలీసులు చర్లపల్లి జైల్‌కు తరలించారు.

చర్లపల్లి జైల్‌కు మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ ఉమేష్ ఖతిక్‌

హైదరాబాద్‌: మోస్ట్ వాంటెడ్ చైన్‌స్నాచర్ ఉమేష్ ఖతిక్‌ ని హైదరాబాద్ పోలీసులు చర్లపల్లి జైల్‌కు తరలించారు. నెల క్రితం ఖతిక్‌ను అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఉమేష్ ఖతిక్ హైదరాబాద్‌లో వరుసగా చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు.హైదరాబాద్ పోలీసులు అతని కోసం ఎంతగానో గాలించారు.  ఒకేరోజు 5 చోట్ల చైన్‌స్నాచింగ్, 12 తులాల బంగారంతో  ఖతిక్ పరారయ్యాడు.బెంగళూరు, గుజరాత్, తెలంగాణలో ఖతిక్ మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్. ఖతిక్‌ను చర్లపల్లి జైల్‌కు  పేట్‌బషీరాబాద్ పోలీసులు తరలించారు. ఉమేష్ ఖతిక్‌ను 10 రోజుల కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. 


Updated Date - 2022-04-17T02:08:53+05:30 IST