కరోనా పనిపట్టే అతినీలలోహిత కి‘రణం’

ABN , First Publish Date - 2020-09-19T13:30:40+05:30 IST

అతినీల లోహిత కిరణాలతో చర్మం, కళ్లపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా కరోనా వైర్‌సను అంతమొందించవచ్చని జపాన్‌లోని హిరోషిమా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు

కరోనా పనిపట్టే  అతినీలలోహిత కి‘రణం’

టోక్యో, సెప్టెంబరు 18: అతినీల లోహిత కిరణాలతో చర్మం, కళ్లపై ఎలాంటి దుష్ప్రభావం పడకుండా కరోనా వైర్‌సను అంతమొందించవచ్చని జపాన్‌లోని హిరోషిమా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంటున్నారు. పరిశోధనలో భాగంగా 100 మైక్రోలీటర్ల రసాయన ద్రావణంలోకి వైర్‌సను చొప్పించి, దాన్ని 9 సెం.మీస్టెరైల్‌ పాలిస్టరైన్‌ ప్లేట్‌లో వేశారు. అనంతరం దాన్ని కాసేపు బయోసేఫ్టీ కేబినెట్‌లో ఉంచి, గది ఉష్ణోగ్రత వద్ద ద్రావణమంతా ఎండిపోయేలా చేశారు. 24 సెం.మీ ఎగువ నుంచి ఆ ప్లేటుపైకి 222 నానోమీటర్ల పౌనఃపున్యం కలిగిన అతినీల లోహిత కిరణాలను ప్రసరింపజేయగా, 30 సెకన్లలోనే ద్రావణంలోని 99.7ు వైరస్‌ అంతమైంది. 

Updated Date - 2020-09-19T13:30:40+05:30 IST